రాజకీయ లబ్ధి కోసమే వైఎస్‌ జగన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు –  హోంమంత్రి వంగలపూడి అనిత  

అమరావతి ముచ్చట్లు:

 

మాజీ సీఎం జగన్ కు సరిపడా భద్రత కల్పిస్తున్నామన్న ఆమె.. 980 మందితో భద్రతా అవసరమా..? అని ప్రశ్నించారు.మంగళవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు.భద్రత పేరుతో జగన్‌ రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నారని హోం మంత్రి అనిత ఎద్దేవా చేశారు. తనకు వస్తున్న ఫిర్యాదుల్లో చాలా వరకు గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ దోపిడీ, దాడులు, అక్రమాలకు సంబంధించినవే ఉంటున్నాయన్నారు. జగన్‌ బాధితులు భారీ సంఖ్యలో పులివెందులు నుంచి ప్రజాదర్భార్‌కు వస్తున్నారని ఆమె వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ బాధితులు ఫిర్యాదులకు వస్తుండడం గమనార్హమన్నారు. ఆయా ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని హోం మంత్రి స్పష్టం చేశారు.

 

Tags: YS Jagan filed a petition in the High Court for political gain – Home Minister Vangalapudi Anitha

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *