Natyam ad

రెండవ సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి

-బాబు మాటలను జనం నమ్మరు

– ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

రాష్ట్రంలో జరిగిన పోలింగ్‌ సరళిని బట్టి వైఎస్సార్‌సీపీకి  అత్యధిక మెజార్టీ స్థానాలు  గెలుస్తామని , వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రెండవ సారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పుంగనూరు నియోజకవర్గంలో పోలీంగ్‌ సరళిని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజలకు ఉన్న నమ్మకం, భరోసాను మార్పు చేయడం ఎవరితరము కాదన్నారు. చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫేస్టోతో ప్రజలను మోసగించేందుకు ఎన్ని డ్రామాలు ఆడిన ప్రజలు నమ్మకపోవడమే పోలీంగ్‌ సరళికి నిదర్శనమన్నారు. ప్రజలందరు ఎంతో సంతోషంగా వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారని స్పష్టం చేశారు.  అత్యధిక ఎమ్మెల్యేలు, ఎంపీలతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చుతుందని తెలిపారు. వైఎస్సార్‌సీపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ కౌన్సిలర్‌ ముత్తంశెట్టి విశ్వనాథ్‌, రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌  కొండవీటి నాగభూషణం, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము, బలిజ సంఘ నాయకుడు రాయల జగదీష్‌కుమార్‌  తదితరులు పాల్గొన్నారు.

 

Tags: YS Jagan Mohan Reddy became the Chief Minister of the state for the second time

Post Midle