Natyam ad

కార్మిక వర్గానికి ఆరాధ్యుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి

టీటీడీ లో పని చేస్తున్న కార్మికులకు జీతాలు పెంచడం హార్సణీయం

వై ఎస్ ఆర్ టీ యు సి రాష్ట్ర అధ్యక్షులు డా. పూనూరు గౌతమ్ రెడ్డి

 

తిరుపతి ముచ్చట్లు:

Post Midle

కార్మిక వర్గానికి ఆరాధ్యుడు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి యని, టీటీడీ లో ఔట్ సోర్సింగ్ కార్మికులకు జీతాలు పెంచడం హార్సనీయమని వై ఎస్ ఆర్ టీ యూ సి రాష్ట్ర అధ్యక్షులు డా. పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు.గురువారం మధ్యాహ్నం2 గం. లకు తిరుచానూరు రోడ్డు లోని అర్బన్ హాట్ నందు టీటీడీ ఔట్ సోర్సింగ్ కార్మికుల సదస్సు ను జిల్లా అధ్యక్షులు ఏ. ఉపేంద్ర రెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమం లో డా. పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ
రాష్ట్రంలో కార్మిక వర్గాన్ని గుర్తించిన వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి
ప్రజా సంకల్ప యాత్రలో కార్మిక కష్టాలు గుర్తించి అధికారంలోకి రాగానే 16 వేల నుంచి 21 వేల వరకు జీతాలు పెంచిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని
అరకొర జీతలుతో ఇబ్బందులూ పడే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భరోసా కల్పిస్తూ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని
ఆర్టీసి కార్పొరేషన్ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది, వై.ఎస్.ఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా పేద ప్రజలకు మేలు చేస్తే.. చంద్రబాబు దాన్ని నిర్వీర్యం చేశాడన్నారు.

 

సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన మళ్ళీ నేడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కు పూర్వ వైభవం వచ్చిందని తెలిపారు.తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ కార్మికులకు జీతాలు పెంచే బోర్డు మీటింగ్ లో సభ్యుడిగా ఉండడం చాలా సంతోషం గా ఉందని అన్నారు. బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం హార్సించా దగ్గ విషయమన్నారు.
వై ఎస్ ఆర్ టీ యూ సి జోనల్ ఇంచార్జ్ నారపరెడ్డి రాజారెడ్డి మాట్లాడుతూ అనేక సంవత్సరాలనుండి టీటీడీ లో తక్కువ వేతనంతో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సారథ్యంలో జీతాలు పెంచడం సంతోసించ దగ్గ విషయమని అన్నారు.ఈ కార్యక్రమం లో వై ఎస్ ఆర్ టీ యు సి నాయకులు చిన్న ఎల్లప్ప, షైక్ మహమ్మద్ రఫీ, తిరుమల రెడ్డి, చిన్నమ్మ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: YS Jagan Mohan Reddy is the idol of the working class

Post Midle