ఇడుపులపాయలో వైకాపా అధినేత వైఎస్ జగన్

Date:12/01/2019
కడప ముచ్చట్లు:
కడప జిల్లా ఇడుపుపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి స్థలం వద్ద క్రైస్తవ పద్ధతిలో  కుటుంబ సభ్యులతో కలిసి వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఘనంగా నివాళ్లు అర్పించారు. ఉదయం ఇడుపులపాయ కు చేరుకున్న జగన్  ముందుగా తన తండ్రి సమాధి దగ్గర రెండు నిమిషాలు  మౌనం పాటించారు. తరువాత ఘాట్ సమీపంలో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. 14 నెలల క్రితం మొదలుపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసుకున్న సందర్భాన జగన్ ఇడుపులపాయలో తండ్రి సమాధిని సందర్శించారు. జగన్మోహనరెడ్డిని చూసేందుకు భారీగా జనం తరలిరావడంతో ఘాట్ ప్రాంగణం జనంతో కిక్కిరిసింది.
Tags:YS Jagan, the head of the Vikaspa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *