– మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
Date:23/05/2020
పుంగనూరు ముచ్చట్లు:
భారత దేశ చరిత్రలో ఎవరు చేయలేని విధంగా ఎన్నికల మ్యానిఫెస్టోను ఏడాదిలో అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనియాడారు. శనివారం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావడంతో పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి తొలుత చిత్తూరు ఎంపీ రెడ్డెప్పతో కలసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీసులకు, వైద్యసిబ్బందికి 104 , 108 సిబ్బందికి బియ్యం, నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. అక్కడ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రజలు 151 స్థానాల్లో ఎమ్మెల్యేలను గెలిపించి, చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన దినం మరువలేనిదన్నారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో చూసిన వాటిని ఎన్నికల మ్యానిపెస్టోలో పెట్టడం జరిగిందన్నారు. మహాత్మగాంధి ఆశించిన గ్రామపరిపాలనకు శ్రీకారం చుట్టి , సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిట పరిపాలన సాగించడం శుభపరిణామమన్నారు. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. నవరత్నాల పేరుతో అన్ని పథకాలను అన్ని వర్గాలకు సచివాలయాల ద్వారా అందించడం జరిగిందన్నారు. జూలై 8న దివంగత ముఖ్యమంత్రి రాజన్న జయంతి రోజున 27 లక్షల మందికి ఇండ్ల పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నవరత్నాలు ఇండ్ల పట్టాలతో పూర్తి కావస్తుందన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు 600 హామిలు ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మాయమాటలు చెప్పి, మ్యానిపెస్టోను గాలికి వదిలి, వెబ్సైట్లో మ్యానిఫెస్టో లేకుండ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ వారికి దక్కిందని ఎద్దెవా చేశారు. ఏడాదిలోనే ఆశించిన అభివృద్ధి చేసి, అన్ని వర్గాలకు ఆదుకున్న మహానేత ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అన్నారు. మరో నాలుగు సంవత్సరాల కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఎన్నికల హామిలను పూర్తిగా నేరవేర్చి , ప్రజల్లోకి రావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్, పెద్దిరెడ్డి, కొండవీటి నాగభూషణం, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, ఉప్యాధిహామి రాష్ట్ర కౌన్సిలర్ ముత్తంశెట్టి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
104, 108 సిబ్బందికి సరుకులు పంపిణీ
Tags: YS Jagan, who ran the election manifesto for the year