Natyam ad

హామిలు అమలు చేసిన ఘనత వైఎస్‌.జగన్‌దే- ఎంపీ రెడ్డెప్ప

పుంగనూరు ముచ్చట్లు:

ఎన్నికల పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామిలను 95 శాతం పైగా అమలు చేసి, ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప స్పష్టం చేశారు. ఆదివారం పాదయాత్ర ఐదేళ్లు కాబడిన సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌తో కలసి కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేశారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన పేదలందరికి నవరత్నాలను అందించడం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వాలు ప్రజాసంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని వర్గాలకు , కులాలకు, మతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించి , గౌరవించడం జరిగిందన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చిరకాలం ఉండేలా ప్రజలందరు ఆశీర్వదించి, ఆయనకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు లలిత, నాగేంద్ర, కౌన్సిలర్లు కొండవీటి నటరాజ, అమ్ము, కిజర్‌ఖాన్‌, నరసింహులు, జెపి యాదవ్‌ తో పాటు పార్టీ నాయకులు రాజేష్‌, సురేష్‌, సోమశేఖర్‌, కిషోర్‌, జవహార్‌, నజిర్‌ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: YS Jagande-MP Reddappa is credited with implementing the guarantee

Post Midle

Leave A Reply

Your email address will not be published.