ముస్లింలకు గుర్తింపు ఇచ్చిన వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి

YS Jaganmohan Reddy, who gave recognition to Muslims

YS Jaganmohan Reddy, who gave recognition to Muslims

Date:12/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి తన మంత్రి వర్గంలో ముస్లింలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, గుర్తింపు ఇచ్చారని పుంగనూరు ముస్లిం నాయకులు అజీజ్‌, అయూబ్‌ఖాన్‌, ఎంఎస్‌.సలీం, ఖాదర్‌ లు కొనియాడారు. బుధవారం ముస్లింలు సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ముతవల్లి అజీజ్‌ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ముస్లింలను గుర్తించి, ముస్లింల అభివృద్ధి కోసం తొలి నుంచి కృషి చేస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖమంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర స్థాయిలో ముస్లింలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వాలు ముస్లింల ఓట్లతో పదవులు పొంది ముస్లింలకు గుర్తింపు లేకుండ చేశారని ఆరోపించారు. వైఎస్సార్సీపి ఎన్నికల ప్రచారంలోనే మైనార్టీలకు ఐదు అసెంబ్లి సీట్లు కేటాయించారని, అందులో నలుగురు ఎమ్మెల్యేలుగా గెలిచారని తెలిపారు . మంత్రి వర్గం ఏర్పాటులో కడప ఎమ్మెల్యే అంజాద్‌ బాషాను ఉప ముఖ్యమంత్రిగా నియమించడం , మంత్రి పదవులు అప్పజెప్పడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలకు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నేనున్నాను అనే భరోసాను కల్పించి, ముస్లింల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని తెలిపారు. భవిష్యత్తులో ముస్లిం మైనార్టీలందరు వైఎస్సార్సీపికి అండగా ఉంటు , వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చిరకాలం ముఖ్యమంత్రిగా ఉండేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి జిందాబాద్‌…. డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిందాబాద్‌ అంటు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అర్షద్‌అలి, పి.మస్తాన్‌, అన్‌సర్‌బాషా, ఫారుల్‌, ఇసుఫ్‌, ఎస్‌.మస్తాన్‌, ముస్టాక్‌, మౌలా, సనమ్‌, ఎస్‌.బాబు, పిరాంసాహెబ్‌, షామీర్‌, గౌసి తదితరులు పాల్గొన్నారు.

 

చిత్తూరు ఎంపి రెడ్డెప్పకు సన్మానం

Tags: YS Jaganmohan Reddy, who gave recognition to Muslims

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *