వైఎస్ రాజశేఖర్ రెడ్డికి “భారతరత్న” ప్రకటించాలి

వైఎస్ఆర్ పాలన స్వర్ణయుగం
ప్రాజెక్టులకు అంకురార్పణ చేసింది వైఎస్;
వైఎస్ జయంతి సభలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల  ముచ్చట్లు:
తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన
దివంగత  జననేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలని మాజీమంత్రి, కాంగ్రెస్  సీనియర్ నాయకులు, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వన్ని కోరారు.గురువారం దివంగత ముఖ్యమంత్రి డా. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి  జయంతిని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పట్టభద్రుల  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గోని , వైఎస్సార్ సేవలను కొనియాడారు.వైఎస్సార్  పాలన సంక్షేమానికి, అభివృద్ధికి స్వర్ణయుగం లాంటిదని,  నేటి తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులకు ఆద్యుడు, సాగు, తాగు నీటి ప్రాజెక్టులకు అంకురార్పణ చేసిన అపర భగీరథుడని కొనియాడారు. ఇప్పుడు కేసీఆర్ గొప్పగా చెబుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కు ఆనాడు వైఎస్ శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు.
తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన జననేత  వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చెబుతూ భారత దేశ చరిత్ర పుటల్లో లికించే విధంగా ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసి, ఉచిత విద్యుత్ ను అందించడమే గాకుండా గ్రామాల్లో కల్లాల వద్దే కేంద్ర ప్రభుత్వం కల్పించిన మద్దతుదరతో హమాలీ చార్జీలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసీ, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసాడని పేర్కొంటూ వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించారాని చెప్పారు.
ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకువచ్చి బడుగు, బలహీన వర్గాలకు విద్యను అందించి
విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తింపుఇచ్చిన గొప్ప నాయకుడన్నారు.
అలాగే 108,104 సేవలు,ఆరోగ్య శ్రీ లాంటి సంక్షేమ పథకాలతో  పేదలకు కార్పొరేట్సం స్థాయి వైద్యాన్ని అందించిన  పేదలపక్షపతి అని కీర్తించారు.
సంక్షేమానికి బాటలు వేసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యావత్ తెలుగు ప్రజలకు గుర్తింపు లభించే విధంగా కృషి చేసిన మహనీయుడు వైఎస్  అన్నారు. నేడు కేసీఆర్ ఇస్తున్న కల్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకం ఆనాడు రాజశేఖర్ రెడ్డి  ప్రవేశపెట్టిన బాలిక సంరక్షణ పథకమేనని చెప్పుకొచ్చారు. ఆడపిల్ల పుడితే వారిపేరిట నగదు బ్యాంకులో వేసి పెళ్లినాటికి 2 లక్షలు అందించారని, మరి కేసీఆర్ దీన్ని రద్దుచేసి కళ్యాణలక్ష్మి పేరిట లక్ష రూపాయలే ఇస్తూ ప్రజలను మోసంచేస్తున్నాడని జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీరును విమర్శించారు. అట్టి పథకాన్ని పునరుద్దరించాలని ఆయన
డిమాండ్ చేశారు.
గౌరవిస్తూ మన బాధ్యతగా భారత రత్న బిరుదాంకితుడిని చేసి గౌరవించాల్సిందిగా యావత్ తెలుగు ప్రజల తరుపున  ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకకంఠంతో భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్,టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి బండ శంకర్,కౌన్సిలర్లు దుర్గయ్య, నక్క జీవన్, మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, సీరాజ్ ఉద్దీన్ మాన్సూర్,
నాయకులు దేవేందర్ రెడ్డి,గుండా మధు, గాజుల రాజేందర్,గాజంగి నందయ్య, చిట్ల అంజన్న, బింగి రవి, పుప్పాల అశోక్, నేహాల్, మున్నా, కోర్టు శ్రీనివాస్, రేపల్లె హరికృష్ణ, దయ్యలా శంకర్,చందా రాధాకిషన్,చాంద్ ,కమల్,రాజేష్,ముజీబ్ , లక్ష్మణ్, శరత్ రెడ్డి, లైశెట్టి విజయ్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:YS Rajasekhar Reddy should be declared a “Bharat Ratna”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *