ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయులు వైఎస్ రాజశేఖరరెడ్డి

మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు మురళీ మోహన్ రెడ్డి
కోసిగి   ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏమహనీయునికి లేని చరిత్ర,ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డికే సొంతమని,అందుకే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడని మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు మురళీ మోహన్ రెడ్డి అన్నారు.గురువారం కోసిగి లో వైయస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అదేశాల మేరకు మురళీ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం ఎఒక్క ముఖ్యమంత్రి తీసుకురాని అనేక సంస్కరణలు తీసుకువచ్చి, ప్రజల మనస్సులను గెలిచిన మహానేతగా నిలిచారని, ఆయన నడిచిన పాదయాత్ర లో ఇచ్చిన హామీలను అమలు పరచడంలో ఐతేనేమి, జలయజ్ఞంతో వ్యవసాయంకు పెద్దపీట వేయడం జరిగిందని ఆయన అన్నారు. రాజశేఖర రెడ్డి చూపిన దారిలో మన జగనన్న జనరంజకంగాపాలన సాగిస్తున్నారని,ఆయన ఆశయసాదన కోసం ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని కోరారు.ముందుగా వైయస్సార్ సర్కిల్ కు ర్యాలీగా వచ్చి, హనుమాన్ విగ్రహంకు పాలాభిషేకం చేసి,తర్వాత రాజశేఖరరెడ్డి విగ్రహంకు పాలాభిషేకం చేసి,గజమాల వేసి జయంతి వేడుకలను ప్రారంభించారు.వచ్చిన వారికి అల్పాహారం మురళీ మోహన్ రెడ్డి చేతుల మీద పంచిపెట్టారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యస్.ఆయ్యమ్మ, వైయస్సార్సీపీ మండల అద్యక్షులు ఆదినారాయణ శెట్టి,ఆర్లబండ సహకార సంఘం అధ్యక్షులు మహాంతేష్ స్వామి,నాడిగేని నరసింహులు, లవకుశ ఈరన్న,మంగమ్మ, నాడిగేని నాగరాజు, మణిక్యారాజు,షంషుద్దీన్, వక్రాణి. వెంకటేష్, నాగేష్, యల్లయ్య,షౌఖత్, దొడ్డి నర్సన్న,కామన దొడ్డి నరసింహ గౌడ్, దుద్ది నాగేష్,కాల్వ. లక్ష్మయ్య,జంపాపురం బసిరెడ్డి,మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:YS Rajasekhara Reddy is a great man who has remained in the hearts of the people forever

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *