కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు

ఎమ్మిగనూరు   ముచ్చట్లు:
పట్టణంలో కాంగ్రెస్ వీరవిదేయుడుగా,కాంగ్రెస్ ఊపిరిగా ప్రజల కోసం నిత్యం పరితపించి… ఇటుప్రజలకు,అటుపార్టీకి తనవంతు సేవలందించి తెలుగుప్రజల హృదయాలలో చిరస్టాయిగా నిలిచిపొయిన మన ప్రియతమ మహానాయకుడు  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 72వ జయంతోత్సవం సంధర్భంగా  ఎమ్మిగనూరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ  ఇంచార్జ్  కె. లక్ష్మీ నారాయణ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి ఖాసిం వలి, ఆధ్వర్యంలో గురువారం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కేక్  కట్ చేసి , కాంగ్రెస్ పార్టీ కి ఆయన అందించిన సేవలను కొనియాడారు. రైతులకు ప్రజలకు యువతకు , విద్యార్థులకు అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఢిల్లీ స్థాయిలో రాజశేఖర్ రెడ్డి  మంచి అరుదైన గౌరవం ఉండేదని, ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి గా కాంగ్రెస్ పార్టీకి సేవలందించారని, ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షుడు వీరేష్ యాదవ్, చాంద్ భాషా, ఆసిఫ్, తెలుగు రాజు, షేక్షావలి,చిన్న రంగస్వమి, సోము, తదితరులు పాల్గొన్నారు..

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:YS Rajasekhara Reddy Jayanti celebrations under the auspices of the Congress party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *