హైదరాబాద్ ముచ్చట్లు:
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల శుక్రవారం ఉదయం టీఎస్పిఎస్సీ కార్యాలయానికి నడుచుకుంటూ వచ్చారు. తరువాత అక్కడ రోడ్డు పై బైఠాయించడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి బెగం బజార్ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ నేపధ్యంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పార్టీ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేసారు. వైఎస్ షర్మిల లతో పాటు వెంట వచ్చిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

షర్మిల మాట్లాడుతూ సర్వీసు కమిషన్ పేపర్ లీకేజీ లో చిన్న వాళ్ళను దోషులుగా చిత్రీకరిస్తున్నారు. పెద్ద వ్యక్తులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. టీఎస్పిఎస్సీ ముందు ఆందోళన అంటే హౌజ్ అరెస్ట్ లు చేస్తున్నారు. నేను బయటకు వెళ్ళాలి అంటే ఇతర కారణాలు చూపించి హౌజ్ అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని నిన్న రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చాను. ఒక హోటల్ రూం లో తలదాచుకుని ఉండాల్సిన పరిస్థితి వుంది. నాకు లుక్ అవుట్ ఆర్డర్ నోటీస్ ఇచ్చారు. నా ఇంటి చుట్టూ వందల మంది పోలీసులను పెట్టారు. నాకు లుక్ అవుట్ ఆర్డర్ ఇవ్వడానికి నేను ఏమైనా క్రిమినల్ నా అని ఆమె ప్రశ్నించారు.
Tags;YS Sharmila Baithaimpu..Arrested
