సీఎంను విమర్శిస్తే మంత్రులకు ఓకేనా..?
– వైఎస్సాఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
తమను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారని వైఎస్సాఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఆమె నేడు మీడియా తో మాట్లాడుతూ.. విధానపరంగా విమర్శించానని.. ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ తోనే తన ప్రసంగాలు కొనసాగాయన్నారు. సీఎం కేసీఆర్ పై ఎన్నో విమర్శలు చేశానని షర్మిల పేర్కొన్నారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తే గమ్ముగా ఉన్న ఎమ్మెల్యేలు.. తమపై విమర్శలు వస్తేనే స్పందిస్తారా..? అని షర్మిల నిలదీశారు. సీఎంను విమర్శిస్తే వీరికి ఓకేనా..? అని ప్రశ్నించారు. స్పీకర్ తనపై ఎలాంటి చర్యలు తీసుకోరని విశ్వసిస్తున్నానన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డిచాలా దారుణంగా ప్రవర్తించాడని.. అందుకే అంతటి విమర్శలు చేసినట్టు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై స్థానిక నేతలకు చిత్తశుద్ధి లేదని.. అందుకే ఇంతటి కాలయాపన అని షర్మిల విమర్శించారు.

Tags: YS Sharmila is the head of YS RTP
