22న మంథనిలో వైఎస్ షర్మిల పర్యటన          

మంథని ముచ్చట్లు:


భారీ వర్షాల కారణంగా మంథని నియోజకవర్గం లోని పలు ప్రాంతాలలో నష్టపోయిన బాధితులను పరామర్శించడానికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల ఈనెల 22న మంథని నియోజకవర్గంలో పర్యటించనున్నారని నియోజకవర్గ  కన్వీనర్ మామిడి వినోద్ తెలిపారు. మంథని పట్టణంలోని మర్రివాడ , అంబేడ్కర్ నగర్, బోయిని పేట, మార్కెట్ ఏరియా, శ్రీపాద కాలనీ, లైన్ గడ్డ, ముత్యాలమ్మ వాడ తోపాటు మండలంలోని సూరయ్యపల్లి, ఎగ్లాస్ పూర్ మంథని నియోజకవర్గ పరిధిలోని కాటారం మండలంలోని అన్నారం , కన్నేపల్లి, పలిమెల మండలాలలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారని ఆయన తెలిపారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమంను విజయవంతం చేయాలని నియోజకవర్గ కన్వీనర్ మామిడి వినోద్ కోరారు.

 

Tags: YS Sharmila’s visit to Manthani on 22nd

Leave A Reply

Your email address will not be published.