కడప బరిలో వైఎస్ వివేకా

YS Viveka in Kadapa

YS Viveka in Kadapa

Date:06/10/2018
కడప ముచ్చట్లు:
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీలు తమ తమ అభ్యర్థుల ఖరారు దశకు వచ్చేసినట్టుగా కనిపిస్తున్నాయి. మార్పు చేర్పులను చేస్తూ.. ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి రాజకీయ పార్టీలు. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ఈ మార్పు చేర్పులు జరుగుతున్నాయి. అటు అధికార తెలుగుదేశం పార్టీ, ఇటు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల ఖరారు దశకు చేరుకున్నాయి.
ఇందులో భాగంగా ఆసక్తిదాయకమైన వార్తలు వస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వివిధ నియోజకవర్గాల్లో మార్పు చేర్పుల్లో ఉంది. ఇందులో భాగంగా సొంత జిల్లాలో కూడా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కొన్ని మార్పులు చేస్తున్నారని సమాచారం. అందులో భాగంగా కడప ఎంపీగా తన బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి అభ్యర్థిత్వానికి జగన్ మొగ్గు చూపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
మొన్నటి వరకూ కడప ఎంపీగా వైఎస్ కుటుంబానికే చెందిన అవినాష్ రెడ్డి కడపకు ఎంపీగా ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాజీనామా చేసిన ఎంపీల్లో అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు.
అయితే అవినాష్ రెడ్డి బాగా సౌమ్యుడు అని, చొచ్చుకుపోయే స్వభావం తక్కువని. .అందుకే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వివేకానందరెడ్డి పోటీ చేస్తే బాగుంటుందని వైఎస్ జగన్ భావిస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో ఆ పార్టీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Tags:YS Viveka in Kadapa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *