YSARCP students' solidarity to form three capitals

మూడు రాజధానులు ఏర్పాటుకు వైఎస్సార్‌సీపీ విద్యార్థుల సంఘీబావం

Date:25/01/2020

 

పుంగనూరు ముచ్చట్లు:

 

మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ శనివారం వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సిద్దీక్‌ ఆధ్వర్యంలో కళశాలల విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దీక్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు దివంగత మహానేత , ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జిందాబాద్‌…మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిందాబాద్‌ ….యువ టైగర్‌ మిధున్‌రెడ్డి జిందాబాద్‌ అంటు నినాదాలు చేసి, ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేశారు. సిద్దీక్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. మహాత్మగాంధిజి కన్న గ్రామ పరిపాలనను దేశంలో తొలిసారిగా అమలు చేసిన ఘనత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి దక్కిందన్నారు. అధికార వికేంద్రీకరణతో పాటు అన్ని ప్రాంతాల ప్రజల అబీష్టానికి అనుకూలంగా మూడు రాజధానుల ఏర్పాటు అభినందనీయమన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అధికారం లేకపోవడంతో పిచ్చేక్కి రోడ్లపై తిరుగుతూ అధికార పార్టీని విమర్శించడం దయ్యాలు వేదాలు వల్లించడమేనని ఎద్దెవా చేశారు. ఇకనైనా తెలుగుదేశం పార్టీ నేతలు మూడు రాజధానులకు మద్దతు పలకాలని లేకపోతే మౌనంగా ఉండాలన్నారు. హద్దులుదాటి ప్రవర్తించినా తెలుగుదేశం పార్టీ వారికి విద్యార్థి సంఘాలచే తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు సంపత్‌, మణి, నరేష్‌, పురుషోత్తం, సుహేల్‌, సునీల్‌, మంజుల, రే ష్మా, గౌతమి తదితరులు పాల్గొన్నారు.

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి

Tags: YSRCP students’ solidarity to form three capitals

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *