ప్రతి రైతు కుటుంబానికి అండగా వైఎస్సార్‌ భరోసా

ysr-assures-every-farmers-family

ysr-assures-every-farmers-family

– అర్హులందరికి ఆర్థిక సహాయం
– పార్టీ కార్యదర్శి పెద్దిరెడ్డి

Date:15/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతు భరోసా ఆర్థిక సహాయం ప్రతి రైతు కుటుంభానికి అందజేసి, ఆ కుటుంబానికి అండగా వైఎస్సార్‌ భరోసా ఉంటుందనేది తెలియజేస్తామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన రైతులకు వైఎస్సార్‌ భరోసా పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఉపాధిహామి రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు విశ్వనాథ్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్‌, పెద్దిరెడ్డి, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, జెడ్పిప్లోర్‌లీడర్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఆర్టీసి మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా రైతులకు వైఎస్సార్‌ భరోసా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సభలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గంలోని 42,971 మందికి ఆర్థిక సహాయం రూ.13,500 లు చొప్పున అందజేయడం జరిగిందన్నారు. ఇంకను మిగిలిన రైతులందరిని గుర్తించి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పుంగనూరులో ప్రతి రైతుకు వైఎస్సార్‌ భరోసా అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ పథకం పారదర్శకంగా అమలు చేసి, రాష్ట్రంలో పుంగనూరు ఆదర్శంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కౌలు రైతులకు కూడ ఆర్థిక సహాయం అందిస్తామని , ఎలాంటి ఆపొహాలకు తావులేకుండ వైఎస్సార్‌ రైతు భరోసా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు నరసింహులు , రామచంద్రారెడ్డి, నాగేశ్వరరావు, విజయభాస్కర్‌రెడ్డి, మురుగప్ప, ఖాదర్‌బాషాతో పాటు ఏడి లక్ష్మానాయక్‌, తహశీల్ధార్‌ వెంకట్రాయులు, ఏవో సంధ్య తదితరులు పాల్గొన్నారు.

మాజీ రాష్ట్రపతి అబ్ధుల్‌ కలామ్‌ విద్యార్థుల సలామ్‌

Tags: ysr-assures-every-farmers-family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *