Natyam ad

మరో సారి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యం

– విద్యార్థి,యువజన విభాగాల ఆత్మీయ సమావేశంలో పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి పిలుపు

 

పీలేరు ముచ్చట్లు:

Post Midle

రానున్న ఎన్నికల్లో మరో సారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డిని చేయడమే లక్ష్యమని, విప్లవాత్మక మార్పులతో రాష్ట్రంలో విద్యారంగాన్ని సీఎం జగన్ కొత్తపుంతలు తొక్కించారని పీలేరు ఇంచార్జ్ పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.గురువారంస్థానిక యం.యం.కల్యాణ మండపంలో నిర్వహించిన పీలేరు నియోజకవర్గ విద్యార్థి యువజన విభాగాల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సుధీర్ రెడ్డి కి విద్యార్థులు, యువకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రాథమిక స్థాయి నుంచి పెద్ద చదువుల వరకు విద్యా రంగంలో పెద్ద మార్పులును సీఎం జగన్ తీసుకువచ్చారన్నారు. విద్యా రంగంలో 57 నెలల కాలంలో కేవలం పథకాల మీద రూ.73 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టడం ఒక చరిత్ర అని అన్నారు.పేదరికం నుంచి బయటికి రావడానికి చదువు ఒక్కటే అస్త్రమని నమ్మి మానవ వనరుల మీద పెట్టుబడి పెడుతున్నారన్నారు.రూ 12 వేల కోట్ల నిధులతో నాడు నేడుతో పాఠశాలల అభివృద్ధి పనులును జగన్ ప్రభుత్వం చేసిందన్నారు. పిల్లలకు ఇచ్చే మంచి ఆహారం నుంచి ఉన్నత చదువులు, ఉద్యోగాల దాకా అన్ని విషయాల్లోనూ వారి బాగోగులే లక్ష్యంగా నడుస్తోందన్నారు.
పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో..

 

 

 

ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా.. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకు ఇచ్చేలా, వారి తల్లుల ఖాతాల్లో నేరుగా ‘జగనన్న విద్యా దీవెన’ ప‌థ‌కం ద్వారా జమ చేస్తున్నది జగనన్న ప్రభుత్వమన్నారు.ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా.. ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ‘జగనన్న వసతి దీవెన’ ప‌థ‌కం ద్వారా ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని, పేదరికం వల్ల ఏ ఒక్కరూ చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని జనవరి 9, 2020న ప్రారంభించారని, 1వ తర‌గ‌తి నుంచి ఇంట‌ర్ వ‌ర‌కు చ‌దివే పిల్ల‌ల‌కు జగనన్న అమ్మ ఒడి పథకం వ‌ర్తిస్తుందని, ఈ పథకం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా పిల్లలను ఎక్కడ చదివించినా, ప్రతి ఏడాది జనవరిలో నేరుగా పథకానికి ఎంపికైన అర్హులైన తల్లుల బ్యాంకు అకౌంట్లలో నగదు జమ చేయడం జరుగుతొందన్నారు.

 

 

 

అమ్మఒడి పథకానికి టెక్నాలజీని అనుసంధానం చేసిందని, దీని ద్వారా పిల్లలు బడికి రాకపోతే మొదటి రోజు తల్లిదండ్రుల ఫోన్‌కు మెసేజ్‌ వస్తుందని, వరుసగా రెండు రోజులు రాకుంటే మూడో రోజు వలంటీర్‌ నేరుగా ఇంటికి వచ్చి పిల్లల యోగ క్షేమాలను విచారిస్తారని పిల్లలను బడికి పంపే బాధ్యత తల్లిదండ్రులదైతే తీసుకొచ్చే బాధ్యతను గ్రామ సచివాలయానికి అనుసంధానంగా ఉన్న ఉద్యోగులు, వలంటీర్లు, పేరెంట్స్‌ కమిటీతో పాటు టీచర్ల మీద ఉంచిందన్నారు.కోవిడ్‌ మహమ్మారి లాంటి సమయంలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహిస్తే, ప్రభుత్వ బడులలో చదివే పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఉద్ధేశ్యంతో 2022 విద్యాసంవత్సరం నుంచి 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు కోరుకుంటే అమ్మఒడి ద్వారా ఇస్తున్న నగదుకు బదులుగా ల్యాప్‌టాప్‌ తీసుకునే విధంగా ఈ పథకంలో కొత్త ఆప్షన్‌ను చేర్చారన్నారు.పిల్లలను బడికి పంపితే చాలు మిగిలిన అన్ని విషయాలను ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు.

 

 

 

విద్యార్థుల తల్లిదండ్రులపై ఎటువంటి ఆర్థిక భారం పడకుండా అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు. ముఖ్యంగా ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు సర్కారు బడిలో చదివే పిల్లలకు విద్యాకానుక రూపంలో 9 రకాల వస్తువులతో కూడిన ‘జగనన్న విద్యాకానుక’ ప్రత్యేక కిట్లు అందజేస్తున్నారన్నారు. వాటిలో విద్యార్థి తరగతికి అనుగుణంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, వర్క్‌బుక్స్‌, ఆక్స్‌ఫర్డ్‌, పిక్టోరియల్‌ డిక్షనరీ, మూడు జతల యూనిఫాం, బూట్లు, బెల్ట్‌, స్కూల్‌ బ్యాగ్‌ అందిస్తున్నారన్నారు. విజ్ఞానపు బొమ్మలతో ఆసక్తి కలిగించే క్లాస్ రూమ్లు, డిజిటల్ తరగతులు, ఇంగ్లిష్ క్లబ్లు, ఆహ్లాదం కలిగించే ప్రాంగణాలు.. ఇలా వైఎస్సార్సీపీ పాలనలో స్పష్టంగా కనిపించిన మార్పు అన్నారు.దీంతో దశాబ్దాల తరువాత రాష్ట్రంలో సర్కారు బడుల రూపురేఖలు మారిపోయాయన్నారు.

 

 

 

రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి లక్షలాది మంది యువత శాశ్విత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని,ఆయనకు యువత అంతా అండగా నిలబడాలని కోరారు.ఎన్నో పరిశ్రమల ద్వారా యువతకు ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగాలు కల్పించారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో విద్యార్థులు, యువకులు తమ ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.ఈ కార్యాక్రమంలో విద్యార్థి విభాగం రీజినల్ కోఆర్డినేటర్ సుంకర చక్రధర్, యువ నాయకులు పుట్ట వంశీ రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షులు హేమంత్ రెడ్డి, సీనియర్ నాయకులు కడప గిరిధర్ రెడ్డి’పంచాయత్ రాజ్ జిల్లా అధ్యక్షులు హబీబ్ బాషా, జె సి ఎస్ కన్వీనర్ ఆనంద్ బాబు పెద్దఎత్తున యువత పాల్గొన్నారు.

Tags: YSR Congress party’s goal is to win once again

Post Midle