వైఎస్సార్‌ రైతు భరోసా సభలు

Date:20/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలంలోని పాల్యెంపల్లె గ్రామంలో శుక్రవారం వైఎస్సార్‌ రైతుభరోసా సమావేశాన్ని నిర్వహించారు. ఏడి లక్ష్మానాయక్‌ ఆధ్వర్యంలో ఏవో సంద్య సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడి మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు వైఎస్సాఆర్‌ రైతు భరోసా సభలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా సాగు చేస్తున్న ప్రతి రైతు కుటుంబం ఈ పథకం క్రింద అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ , బీసీ , మైనార్టీలకు చెందిన కౌలు రైతులు కూడ అర్హులన్నారు. రైతులు తమ ఆధార్‌, రేషన్‌కార్డు, పట్టాపాసుపుస్తకం, బ్యాంకు ఖాతా పాసుపుస్తకం జిరాక్స్ కాపిలను తక్షణమే అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈవో శివకుమార్‌, వలంటీర్లు , వీఆర్‌వోలు పాల్గొన్నారు.

జగన్‌ వందరోజుల పాలన పారదర్శకం

Tags: YSR Farmer Assurance Assemblies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *