పత్తికొండ టిటిడి కళ్యాణమండపం నందు వైఎస్సార్ చేయూత కార్యక్రమం
పత్తికొండ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమ మరియు అభివృద్ధినీ దృష్టిలో ఉంచుకొని పేద-నిరుపేదలకు నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. మహిళల సమగ్ర అభివృద్ధి అజెండాగా ఆర్థిక సాధికారతలో భాగంగా వైయస్సార్ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసుగల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మరియు మైనార్టీ వర్గాలకు చెందిన మహిళల అభివృద్ధికి చేయూతనందిస్తూ అందిస్తున్న గొప్ప పథకాన్ని మండల కేంద్రమైన పత్తికొండ 3979 మంది లబ్ధిదారులకు 7 కోట్ల 44 లక్షల మెగా చెక్కును పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ గారు లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల వైయస్సార్ పార్టీ నాయకులు, సర్పంచులు,ఎంపిటిసి సభ్యులు, మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీ సభ్యులు మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Tags: YSR handover program at TTD Kalyanamandapam, Patikonda
