Date:08/11/2019
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు మండలం నల్లగుట్లపల్లెతాండలో శుక్రవారం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ శిబిరం నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సోనియా ఆధ్వర్యంలో 242 మందికి చికిత్సలు నిర్వహించారు. వీరిలో నలుగురిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పోరేట్ వైద్యసేవలు అందించేందుకే వైఎస్సార్ ఆరోగ్యశ్రీని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టారని తెలిపారు. పొరుగుర్ఖా•లలో కూడ ఆరోగ్యశ్రీ పథకం క్రింద నాణ్యమైన వైద్యసేవలు అందించడం జరుగుతుందన్నారు. ప్రజలు ఆనారోగ్యానికి గురైన వెంటనే చికిత్సలు చేసుకుని , వైఎస్సార్ ఆరోగ్యశ్రీ క్రింద లబ్ధిపొందాలన్నారు. ఈ కార్యక్రమంలో డీటీఐ అమరనాథ్, సూపర్వైజర్లు సోమలి, సిబ్బంది అనిత, పద్మ, అఫ్సర్ఉన్నిసా, గౌతమి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ
Tags: YSR Healthcare Camp in Nallagutpalle