సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపు కోసం “వైఎస్ఆర్ నవశకం”

-జిల్లా కలెక్టర్ సత్యనారాయణ

Date:16/11/2019

అనంతపురం ముచ్చట్లు:

వివిధ సంక్షేమ పథకాల అర్హులందరికీ అందేలా లబ్ధిదారులు గుర్తింపు కోసమే వైయస్సార్ నవ శకం కార్యక్రమం ఉద్దేశం అని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. జడ్పీ కార్యాలయం నందు సమావేశ మందిరంలో, మరియు జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం సమావేశ మందిరంలో, వైయస్సార్ నవ శకం కార్యక్రమం సంబంధించిన జిల్లాలోని వివిధ మండలాలలో మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవో లతో డిప్యూటీ తహసీల్దార్లు, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్లు, ఈవోపీఆర్డీ లు, MPHO లకు ఒక్కరోజు ToT టి లకు శనివారంశిక్షణ కార్యక్రమం నిర్వహించారు, జడ్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో శోభ స్వరూపరాణి, డి ఆర్ డి పి డి నరసింహారెడ్డి, జడ్పీ డిప్యూటీ సీఈవో, నరసింహారెడ్డి, ఇన్చార్జి డీఈఓ లక్ష్మీనారాయణ, సాంఘికసంక్షేమ శాఖడి డి విశ్వమోహన రెడ్డి, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.

 

 

 

ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్దిదారుల గుర్తింపునకై వైఎస్ఆర్ నవశకం పేరిట ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించనున్నట్టు, ఈనెల 20వ తేదీ నుండి డిశంబరు 20వ తేదీ వరకూ జిల్లావ్యాప్తంగా ప్రత్యేక సర్వే క్యాంపెయిన్ ను చేపడతామన్నారు. ఈ నెల రోజుల క్యాంపెయిన్ లో భాగంగా గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రతిరోజూ 10 ఇళ్లకు వెళ్లి వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియ కింద సర్వే చేపట్టాలన్నారు. రోజువారీ సర్వే వివరాలను గ్రామ,వార్డు సచివాలయాలకు అందజేయాలని స్పష్టం చేశారు. వాలంటీర్లు ప్రతి ఇంటినీ సర్వే చేసే విధంగా చర్యలు తీసుకోవడంతోపాటు ఈ సర్వే ప్రక్రియ సక్రమంగా జరిగేలా ఎంపీడీవో, మున్సిపల్ అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. అంతేగాక సేకరించిన డేటాను గ్రామ/వార్డు సచివాలయం స్థాయిలోను లేదా మండల, మున్సిపల్ స్థాయిలోగాని సకాలంలో కంప్యూటరీకరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నూతన బియ్యం కార్డు, వైయస్సార్ పెన్షన్ కానుక కార్డు, వైయస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు, జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన కార్డుల పంపిణీకి లబ్దిదారుల గుర్తింపునకై వార్డు, గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికీ వెళ్ళి అర్హులైన లబ్దిదారులను గుర్తించాలన్నారు.

 

 

 

 

అలాగే వైయస్సార్ మత్స్యకార భరోసా, వైయస్సార్ నేతన్ననేస్తం, వైయస్సార్ సున్నా వడ్డీ పథకం, అమ్మఒడి, ట్రైలర్లు, రజకులు, నాయీ బ్రాహ్మణుల షాపులు, వైయస్సార్ కాపు నేస్తం, ఇమామ్స్, మౌజంలు, పాస్టర్లు, అర్చకులకు సంబంధించిన లబ్దిదారులను గుర్తించాలన్నారు. బియ్యం కార్డు, పెన్షన్ కార్డు పొందు కోరే గ్రామీణులు అయితే నెలకు పదివేల రూపాయలు, పట్టణాల వారైతే నెలకు 12 వేల రూపాయలు ఆదాయం ఉన్న వారంతా అర్హులే, కుటుంబానికి మూడు ఎకరాల లోపు మా గాని, పది ఎకరాల లోపు మెట్ట భూమి.. లేదా మా గాని మెట్ట కలిపి పది ఎకరాల ఉన్నవారు అర్హులే, జగనన్న విద్యా దీవెన.. వసతి దీవెన జగనన్న విద్యా దేవుని కింద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, జగనన్న విద్య దీవెన కింద ఏడాదికి 20,000 రూపాయలుఇచ్చేందుకు ప్రభుత్వం విడివిడిగా కార్డులను మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి 2.50 లక్షల లోపు గలవారు అర్హులే, పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఇవ్వడం జరిగిందని .

 

 

 

 

 

ఆదాయం పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు అనర్హులుగా గుర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమాలలో కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని.9 ఇచ్చిన ప్రొఫార్మా జాగ్రత్తగా పరిశీలించి, అవగాహన చేసుకొని టీవోటీలు  వారు గ్రామ, వార్డు వాలంటీర్లకు శిక్షణ అందజేయాలని. ఈ నెల 18 19 తేదీల్లో ఈ కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.. నెలరోజుల్లో సర్వే ప్రక్రియ పూర్తయ్యాక ఎండిఓలు, మున్సిపల్ కమీషనర్లు శాఖలవారీ, పథకాల వారీగా ముసాయిదా లబ్దిదారుల జాబితాను రూపొందించి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆ జాబితాను ప్రదర్శించాలని చెప్పారు. వాటిపై 3 రోజుల్లోగా అభ్యంతరాలుంటే స్వీకరించి తదుపరి ఎండిఓలు, మున్సిపల్ కమీషనర్లు గ్రామ,వార్డు సభలు నిర్వహించి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అర్హులైన లబ్దిదారుల తుది జాబితాను రూపొందించి శాశ్వత సోషల్ ఆడిట్ కింద తుది జాబితాను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి ఉంచాలని పేర్కొన్నారు. సర్వే నిర్వహణపై జిల్లా,మండల స్థాయిలో గ్రామ/వార్డ్ వాలంటీర్లకు శిక్షణా తరగతులను నిర్వహించాలన్నారు. నవంబర్ 20 నుండి నవంబర్ 30 వరకు గ్రామ/వార్డ్ వాలంటీర్లు ఇంటింటి సర్వే చేయాలన్నారు. నవంబర్ 21 వ తేదీ నుండి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు వాలంటీర్లు సేకరించిన డేటా ను కంప్యూటరీకరణ చేయాలన్నారు.

 

 

 

 

 

డిసెంబర్ 2 నుంచి 7 వ తేదీ వరకు అనర్హులైన వారిని మరోసారి పరిశీలిస్తారన్నారు. 8 వ తేదీన పథకాల వారీ అర్హులైన లబ్దిదారుల
జాబితా తయారు చేయాలని, 9 వతేదీన గ్రామ /వార్డ్ సచివాలయాల్లో ఈ జాబితాను ప్రదర్శించాలన్నారు. 10 నుంచి 12 వరకు అభ్యంతరాలు, సలహాలను స్వీకరించాలన్నారు.13 నుండి 16 వ తేదీ వరకు గ్రామ సభలను నిర్వహించి అర్హులైన లబ్ధిదారుల తుది జాబితాను రూపొందించాలన్నారు.17 నుంచి 19 వ తేదీ వరకు కార్డులను తయారు చేసి 20 వ తేదీన లబ్దిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం షెడ్యూల్ ను ప్రకటించిందన్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం వివిధ సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారుల ఎంపికకుచర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇసుక రీచ్ ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: “YSR Navasakam” for identification of beneficiaries of welfare schemes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *