డిసెంబర్‌ 20 వరకు వైఎస్సార్‌ నవశకం కార్యక్రమం

YSR Navasakam program till December 20th

YSR Navasakam program till December 20th

Date:20/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వైఎస్సార్‌ నవశకం కార్యక్రమం క్రింద అర్హులైన పేదలందరికి సంక్షేమ పథకాలను అందించేందుకు డిసెంబర్‌ 20 వరకు సర్వే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. బుధవారం ఆయన నవశకం కార్యక్రమంపై పట్టణ సచివాలయాలలో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు సదస్సులు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటిలో వైఎస్సార్‌ నవశకం క్రింద బియ్యంకార్డు, వైఎస్సార్‌ పెన్షన్‌, ఆరోగ్యశ్రీ, విద్యాదీవెన, వసతిదీవెన కార్డుల మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇంటింటా సర్వే నిర్వహించి, లబ్ధిదారులను గుర్తించి, వారందరికి అవసరమైన పథకాలను అందిస్తామన్నారు. మున్సిపల్‌ సిబ్బంది, వలంటీర్లు సర్వే కార్యక్రమాన్ని డిసెంబర్‌ 20 వరకు నిర్వహిస్తారని తెలిపారు. పట్టణ ప్రజలందరు సర్వే సిబ్బందికి సహకరించి, పూర్తి వివరాలు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో మేనేజర్‌ రసూల్‌ఖాన్‌, టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ కృష్ణారావు, ఆర్‌వో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు ప్రజలకు సమ్మర్‌స్టోరేజ్‌ ద్వారా జనవరిలో నీరు

Tags: YSR Navasakam program till December 20th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *