20 నుంచి వైఎస్సార్‌ నవశకం సర్వే

Date:19/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు మున్సిపాలిటిలో వైఎస్సార్‌ నవశకం క్రింద బియ్యంకార్డు, వైఎస్సార్‌ పెన్షన్‌, ఆరోగ్యశ్రీ, విద్యాదీవెన, వసతిదీవెన కార్డుల మంజూరు సర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు డిసెంబర్‌ 20 వరకు నెల రోజుల పాటు ఇంటింటా సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. సర్వేవివరాలను సేకరించి అర్హులైన లభ్ధిదారులను గుర్తించడం జరుగుతుందన్నారు. పట్టణ ప్రజలందరు సర్వే సిబ్బందికి పూర్తి వివరాలు తెలియజేసి సహకరించాలని కోరారు. ఈ విషయమై సచివాలయాలలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రజలు సహకరించాలన్నారు.

ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం

Tags: YSR Navasakam survey from 20th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *