Natyam ad

పుంగనూరులో వైఎస్సార్‌ పోషణ బేష్‌

పుంగనూరు ముచ్చట్లు:

అంగన్‌వాడీ కేంద్రాలలో వైఎస్సార్‌ పోషణ పథకం క్రింద పంపిణీ చేస్తున్న ఆహార పదార్థాలు సక్రమంగా పంపిణీ చేస్తూ మంచి సేవలు అందిస్తున్నారని జిల్లా విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్‌ శేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన పట్టణంలోని ఈస్ట్పేట అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలింతలకు, గర్భిణిలకు, పిల్లలకు పంపిణీ చేస్తున్న భోజన ం పరిశీలించారు. సీఐ మాట్లాడుతూ జిల్లా విజిలెన్స్ ఎస్పీ ఈశ్వర్‌రెడ్డి ఆదేశాల మేరకు అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశామన్నారు. ఎలాంటి లోపం లేకుండ సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఈ తనిఖీలలో ఎస్‌ఐ రామకృష్ణనాయక్‌, ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ అయిషా పాల్గొన్నారు.

 

Post Midle

Tags: YSR Nutrition Bash at Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.