Natyam ad

తల్లి,బిడ్డ కోసమే వైఎస్సార్‌ పోషణ

పుంగనూరు ముచ్చట్లు:

తల్లి, బిడ్డలు క్షేమంగా ఉండేందుకే బాలింతలకు , గర్భవతులకు వైఎస్సార్‌ పోషణ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు కౌన్సిలర్‌ పూలత్యాగరాజు తెలిపారు. మంగళవారం కోనేటిపాళ్యెంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఆయన కిట్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ముందుచూపుతో తల్లి, బిడ్డల శ్రేయస్సుకోరుతూ నాణ్యమైన పోషక పదార్థాలను అందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి వాటిని సద్వినియోగం చేసుకుని ,రాబోవు ఎన్నికల్లో తిరిగి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పూజిత, సిబ్బంది సునంద పాల్గొన్నారు.

 

Post Midle

Tags: YSR nutrition is for mother and child

Post Midle