వైఎస్సార్‌ రైతు భరోసా జాబితా విడుదల

YSR releases farmer reassurance list

YSR releases farmer reassurance list

Date:09/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలంలో వైఎస్సార్‌ రైతు భరోసా పథకం క్రింద అర్హులు, పెండింగ్‌, అనర్హుల జాబితాను గ్రామాల వారిగా సచివాలయాలలో విడుదల చేసినట్లు ఏవో సంధ్య తెలిపారు. బుధవారం ఆమె మండలంలోని ఈడిగపల్లె గ్రామ సచివాలయంలో జాబితాను మాజీ ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, మాజీ ఎంపీపీ నర సింహులు తో కలసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు రైతులందరు జాబితాను పరిశీలించుకుని వెంటనే సరి చూసుకోవాలన్నారు. అలాగే తమ ఆధార్‌, పట్టాదారు పాసుపుస్తకం నందు లింకు చేసుకోవాలన్నారు. జాబితాలో చనిపోయిన వారు, అనర్హులు ఉంటే తెలియజేయాలన్నారు. ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా 11 వ తేదీలోపు రైతులు వ్యవసాయ కార్యాలయంలో తెలపాలన్నారు. అలాగే బ్యాంకు ఖాతాలు సమర్పించని వారు బ్యాంకు ఖాతా వివరాల జిరాక్స్ కాపిలను కార్యాలయంలో తక్షణమే సమర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈవో సుబ్రమణ్యం, రైతులు పాల్గొన్నారు.

పుంగనూరుకు పెద్దిరెడ్డితో మహర్ధశ

Tags: YSR releases farmer reassurance list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *