YSRC leader Chengareddy dies

వైఎస్‌ఆర్‌సీ నాయకుడు చెంగారెడ్డి మృతి తీరనిలోటు

– మంత్రి పెద్దిరెడ్డి

Date:19/09/2020

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ మండల కార్యదర్శి చెంగారెడ్డి ఆనారోగ్యంతో మృతి చెందడం పార్టీకి తీరనిలోటని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మండలంలోని కోటగడ్డ గ్రామానికి వచ్చారు. మృతుడు చెంగారెడ్డి ఇంటికి వెళ్లి చెంగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. చెంగారెడ్డి మృతి చెందడంతో మండల ప్రజలకు, పార్టీకి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. చెంగారెడ్డి కుటుంభానికి అన్ని విధాల చేయూతనందిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మాజీ ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌తో పాటు స్థానిక నాయకులు రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కర్ణాటకలో మళ్లీ వర్ష బీభత్సం..లోతట్టు ప్రాంతాలు జలమయం!

Tags: YSRC leader Chengareddy dies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *