YSRCP aims at village administration

గ్రామ పరిపాలనే వైఎస్‌ఆర్‌సీపీ ఆశయం

– భాస్కర్‌రెడ్డి

Date:21/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ముంగిటకు పరిపాలన తీసుకెళ్లడమే వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ ఆశయమని ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని బసివినాయునిపల్లె గ్రామంలో రూ.45 లక్షలతో సచివాలయ భవన నిర్మాణానికి రూ.22 లక్షలతో రైతు భరోసా కేంద్రం నిర్మాణాలకు ఆయన భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సచివాలయ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తోందన్నారు. ప్రజల నుంచి అందిన అర్జీలకు ఎలాంటి ఫీజులు లేకుండ గంటల వ్యవధిలోనే ప్రభుత్వ పథకాలను మంజూరు చేసి, అర్హులైన పేదలందరికి సచివాలయాలలో సేవలు అందించడం జరుగుతోందని కొనియాడారు. ముఖ్యంగా రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఎలాంటి రవాణా చార్జీలు లేకుండ అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి దక్కిందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సచివాలయ వ్యవస్థపై దృష్టి సారించారని కొనియాడారు. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు మరింతగా ప్రజలకు సేవలు అందించి రాష్ట్రంలో పుంగనూరును ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నిలిపేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఎంపీడీవో రాజేశ్వరి, ఈవోపీఆర్‌డి కృష్ణవేణి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యదర్శులు చంద్రారెడ్డి యాదవ్‌, దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, పార్టీ స్థానిక నాయకులు శంకరప్ప, నారాయణరెడ్డి, రామకృష్ణ, సూరప్ప, కార్యదర్శి పద్మనాభరెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.

సరస్వతీదేవి గా బోయకొండ గంగమ్మ

Tags; YSRCP aims at village administration

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *