-మెగా జాబ్‌మేళాకు అపూర్వ స్పందన
Date:23/01/2021
పుంగనూరు ముచ్చట్లు:
నిరుద్యోగులకు ఉప్యాధి కల్పించి, వారిని అన్ని విధాల ఆదుకోవడమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఆశయమని మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. శనివారం పట్టణంలో నిర్వహించిన మెగాజాబ్‌మేళాకు అపూర్వ స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా మంత్రితో కలసి ఎంపీ రెడ్డెప్ప, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి హాజరైయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి, నిరుద్యోగ యువతి, యువకులు నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో బాబువస్తే జాబ్ వస్తుందని అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు మాయమాటలతో నిరుద్యోగులను మోసగించారని దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే మూడు లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగాలను తొలగించారని ఎద్దెవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో నిరుద్యోగులకు అగ్రస్థానం కల్పించి, అవకాశం ఉన్న ప్రతి రంగంలోను నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. పుంగనూరు నియోజకవర్గంలోని సుమారు 11 వేల మంది నిరుద్యోగ యువతి, యువకులు ఉద్యోగాల కోసం నమోదు చేసుకున్నారని, 23 కంపెనీలలో సుమారు 2500 మందిని నియమిస్తున్నామని తెలిపారు. దశల వారీగా నిరుద్యోగ సమస్యను పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీఆర్ కమిషనర్ ఓఎస్డి దుర్గాప్రసాద్, జెడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, పరిశ్రమలశాఖ జిల్లా అధికారి ప్రతాప్‌రెడ్డి, మెప్మా పీడి జ్యోతి తో పాటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్, పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, కొండవీటి నాగభూషణం, ఉపాధిహామి రాష్ట్ర కౌన్సిలర్ ముత్తంశెట్టి విశ్వనాథ్ , మాజీ జెడ్పిప్లోర్ లీడర్ వెంకటడడ్డి యాదవ్ పాల్గొన్నారు.
పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి
Tags: YSRCP aims to support the unemployed in Punganur – Minister Peddireddy