Natyam ad

పుంగనూరులో వైఎస్సార్‌సీపీ ప్రచారాల జోరు

పుంగనూరు ముచ్చట్లు:

మే 13న జరగనున్న అసెంబ్లి, పార్లమెంటు ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ప్రచారాలలో దూసుకుపోతోంది. బుధవారం పట్టణంలోని పిఆర్‌ఆర్‌ వారియర్స్ ఆధ్వర్యంలో డాక్టర్లు శివ, శరణ్‌, లయన్స్క్లబ్‌ ప్రతినిధులు త్రిమూర్తిరెడ్డి, రెడ్డిజన సంక్షేమ సంఘం నాయకులు మధుసూదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘ నాయకులు ముల్లంగి విజయకుమార్‌, బాలసుబ్రమణ్యం, పిఎల్‌.శ్రీధర్‌, బ్రాహ్మణ సంఘ ప్రతినిధి ఆర్‌కె.రామకృష్ణ, రమణరావు, విశ్రాంత మిలటరీ ఉద్యోగులు కృష్ణప్ప, శ్రీనివాసులు, రెడ్డెప్ప, భవన కార్మికుల సంఘ నాయకులు కేశవరెడ్డి, భాస్కర్‌, పట్టణ సచివాలయాల కన్వీనర్‌ వరదారెడ్డి, మైనార్టీ నాయకులు , ముతవల్లి అజిజ్‌సాహెబ్‌, ఎస్‌కెపి.ఖాజా, అయూబ్‌ఖాన్‌, బిటి అతావుల్లా, ఇంతియాజ్‌ఖాన్‌ లు ప్రచారాలు చేపట్టారు. అలాగే ముస్లిం యూత్‌ నాయకులు ఇర్ఫాన్‌, అప్రీద్‌, మాలిక్‌, మమ్ము, అమ్ముకుట్టి లు ప్రచారాలు చేపట్టారు. వీరితో పాటు రహమత్‌ నగర్‌లో సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్దీన్‌ షరీఫ్‌, కౌన్సిలర్లు సాజిదాబేగం లు ప్రచారం చేశారు. అలాగే కౌన్సిలర్లు కమలమ్మ, జయభారతి, విజయభారతి, కిజర్‌ఖాన్‌, నరసింహులు, సుప్రియ, వైస్‌ చైర్మన్‌ లలిత వారి వార్డులలో ప్రచారాలు చేపట్టారు. ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కరపత్రాలు పంపిణీ చేసి కోరారు. ఈ ప్రచారాలలో ముస్లిం యూత్‌ ఇర్షాద్‌, ఆసిఫ్‌, కమర్‌, యూసుఫ్‌, షామీర్‌, అస్లాం, అయాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

 

Tags; YSRCP campaigns in Punganur

Post Midle