Natyam ad

పుంగనూరులో వైఎస్సార్‌సీపీ ప్రచారాల జోరు

పుంగనూరు ముచ్చట్లు:

ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతుగా పార్టీ ప్రచారాలను ఉధృతం చేసింది. శనివారం పట్టణంలోని చంద్రకాంత్‌వీధి, గోకుల్‌వీధిలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము ఆధ్వర్యంలో ప్రచారాలు చేశారు. అలాగే రహమత్‌నగర్‌లో కౌన్సిలర్‌ సాజిదాబేగం ఆధ్వర్యంలో ప్రచారాలు చేశారు. అలాగే ఎంబిటి రోడ్డులోదళిత నాయకుడు శంకరప్ప ఆధ్వర్యంలో ప్రచారాలు చేశారు. మేలుపట్ల, కొత్తపేట క్రాస్‌లో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సిఆర్‌.లలిత, పిఆర్‌ఆర్‌ వారియర్స్ డాక్టర్లు శివ, శరణ్‌, సుధాకర్‌రెడ్డి, త్రిమూర్తిరెడ్డి లు ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకటమిధున్‌రెడ్డి లను అఖండ విజయంతో గెలిపించాలని , రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేయాలని కోరారు. ప్రచారాలలో నాయకులు గోపాలకృష్ణ, రామకృష్ణ, నానబాలగణేష్‌, కృష్ణారెడ్డి,భాస్కర్‌జెట్టి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: YSRCP campaigns in Punganur

Post Midle