Natyam ad

పుంగనూరులో వైఎస్సార్‌సీపీ ప్రచారాల జోరు 

పుంగనూరు ముచ్చట్లు:

ఎన్నికల నగారా మ్రోగడంతో వైఎస్సార్‌సీపీ ప్రచారాలు ఊపందుకుంది.రాష్ట్రజానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము లు విడివిడిగా ప్రచారాలు ఇంటింటా నిర్వహించారు. అలాగే మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ లలిత, కౌన్సిలర్లు కిజర్‌ఖాన్‌, నరసింహులు, జెపి.యాదవ్‌, రేష్మా, సాజిదాబేగంలు వారి వార్డులలో ప్రచారాలు నిర్వహించారు. అలాగే దళిత నాయకులు రాజు, శంకరప్ప, పెంచుపల్లి కృష్ణప్ప ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేశారు. రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో నాయకులు మహబూబ్‌బాషా, రాజేష్‌, కొండవీటి నరేష్‌, సురేష్‌, మురళి, జావీద్‌, అమ్ముకుట్టి, మమ్ము తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: YSRCP campaigns in Punganur

Post Midle