వైఎస్సార్‌సీపీ వారికి అండగా న్యాయవాదుల విభాగం ఏర్పాటు

-దాడులు చేస్తే మూల్యం చెల్లించక తప్పదు
– ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

పుంగనూరు ముచ్చట్లు:

 

తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్న దాడులు, ఆస్తుల నష్టం నుంచి వైఎస్సార్‌సీపీ వారిని కాపాడేందుకు న్యాయవాదులను నియమించినట్లు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ పుంగనూరు పట్టణంలో ఇండోర్‌ స్టేడియంను తెలుగుదేశం పార్టీ గూండాలు కూల్చివేయడం, తప్పుడు కేసుల బనాయింపులు, బెదిరింపులపై ఎప్పటికప్పుడు న్యాయవాదులు చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలోని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైన ఉచితంగా న్యాయసేవలు అందించనున్నట్లు తెలిపారు. ఇందు కోసం పుంగనూరుకు చెందిన సీనియర్‌ న్యాయవాదులను వైఎస్సార్‌సీపీ తరపున వాదించేందుకు నియమించామన్నారు. పార్టీ వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగిన స్థానిక కోర్టులతో పాటు హైకోర్టు, హ్యూమన్‌రైట్స్ కమిషన్‌కు న్యాయవాదులు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసి, కేసు దాఖలు చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. దాడులు, ఆస్తుల నష్టంపైన పోలీసులు స్పందించకపోతే పార్టీ తరపున వారిపై కూడ కేసులు దాఖలు చేస్తారని , చట్టవ్యతిరేక కార్యక్రమాలకు ఎవరు పాల్పడిన సహించేది లేదని, దాడులకు మూల్యం చెల్లించక తప్పదని ఎమ్మెల్యే హెచ్చరించారు. పుంగనూరు నియోజకవర్గంలోని బాధితులు తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు ఈ క్రింది న్యాయవాదులను సంప్రదించాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సూచించారు.

1. సి.మల్లికార్జునరెడ్డి సెల్‌నెంబరు: 9440752067
2. పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌, సెల్‌నెంబరు: 9440001995
3.కె.అంజిబాబు, సెల్‌నెంబరు: 9449589591
4.కెవి.ఆనందకుమార్‌, సెల్‌నెంబరు:9849172053
5.ఎం.రాఘవేంద్ర, సెల్‌నెంబరు: 8247228034
6.ఎంఎస్‌.రోహిత్‌రెడ్డి, సెల్‌నెంబరు: 9491076430

 

Tags: YSRCP formed a section of advocates under them

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *