Natyam ad

రైతుల కోసమే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం

బేతంచర్ల ముచ్చట్లు:

రైతుల కోసమే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అని ఆర్థిక శాఖ మంత్రి  బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి  అన్నారు. శుక్రవారం నాడు జగనన్న శాశ్వత భూహక్కు పథకంలో భాగంగా బేతంచర్ల మండల పరిధిలోని అంబాపురం గ్రామంలోని 35 మంది రైతులకు పట్టలను ఆర్థిక శాఖ మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ముందుగా మద్దిలేటి స్వామి ఆర్చి నుండి అంబాపురం గ్రామానికి 2.5 కిలోమీటర్ల మేర 95.50 లక్షలతో వేసిన తా రోడ్డును ప్రారంభించారు. అనంతరం మద్దిలే స్వామి వస్తానుండి అంబాపురం గ్రామానికి కాలినడకన పాదయాత్ర చేసి ఆర్థిక మంత్రి గ్రామానికి చేరుకున్నాడు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల కోసం మౌనిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రైతులకు భరోసానిస్తూ రైతు భరోసాను ప్రవేశపెట్టిందని పంట వేసిన రైతులకు నష్టపోకుండా పంట బీమా సౌకర్యాన్ని కల్పించి రైతులను ఆదుకుంటుందని ప్రతి గ్రామానికి శాశ్వత రోడ్డు నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నామని గ్రామాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి దేనిని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.పీ బుగ్గన నాగభూషణం రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ చల్లం రెడ్డి,  మద్దిలేటి స్వామి ఆలయ చైర్మన్ సీతారామ చంద్రుడు, మద్దిలేటి స్వామి ఆలయ ఈ.వో పాండురంగారెడ్డి, వై.ఎస్.ఆర్సి.పి నాయకులు బాబు రెడ్డి, మూర్తి జావలి, ఖాజా, పిట్టల జాకీర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: YSRCP government is for farmers

Post Midle