పేదల గుండెచప్పుడే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

పేద ప్రజల గుండె చప్పుడుతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైందని , ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి ఆశయమని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి కొనియాడారు. మంగళవారం సాయంత్రం మండలంలోని బోడేవారిపల్లెలో వైఏపీ నీడ్స్ జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. బోయకొండ ఆలయ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లె చెంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి తో కలసి డిజిటల్‌ బోర్డును ఆవిష్కరించారు. గ్రామంలో జెండాఎగురవేసి, కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయాల కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, జయనారాయణరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: YSRCP government is the heartbeat of the poor – MPP Bhaskar Reddy

Post Midle