Natyam ad

వై.యస్.ఆర్.సి.పి ఆవిర్భావ వేడుకలు

అనంతపురము ముచ్చట్లు:

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి   వై.యస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ని స్థాపించి 13 వసంతాలు పూర్తి చేసుకుని 14వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంలో స్థానిక రెండవ రోడ్డులోని వై.యస్.ఆర్.సి.పి కార్యాలయం నందు ఏర్పాటుచేసిన ఆవిర్భావ వేడుకలలో ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్   బోయ గిరిజమ్మ   పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా దివంగత నేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి   విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించి, పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందాని పార్టీ శ్రేణులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్  మాట్లాడుతూ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కష్టాలను చూసి, విని పుట్టిన పార్టీ. జగనన్న తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి, విని “నేను విన్నాను..నేను ఉన్నాను” అని భరోసా ప్రజలకు కల్పిస్తూ, ప్రజలకు అండగా వై.యస్.ఆర్.సి.పి ని స్థాపించి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, ప్రభుత్వం ఏర్పడిన రోజు నుండి ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధేయంగా పాలన సాగిస్తూ పార్టీని 13 సంవత్సరాలు నడిపి నేడు 14వ వసంతంలోకి విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు .మన ముఖ్యమంత్రి   వై.యస్ జగన్ మోహన్ రెడ్డి  . ఈ సందర్భంగా జన నేత జగనన్నకు, వై.యస్.ఆర్.సి.పి నాయకులకు, పార్టీ శ్రేణులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ ఎమ్మెల్యే మరియు అనంతపురము పార్లమెంట్ సమన్వయ కర్త   మాలగుండ్ల శంకర్ నారాయణ  , ఎమ్మెల్సీ   మంగమ్మ  , అనంతపురము నగర పాలక సంస్థ మేయరు, డిప్యూటి మేయర్లు, వై.యస్.ఆర్.సి.పి అనంతపురము జిల్లా అధ్యక్షులు, వివిధ కార్పోరేషన్ చైర్ పర్సన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నేతలు మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

Post Midle

Tags:YSRCP Inauguration Ceremony

Post Midle