పుంగనూరు ముచ్చట్లు:
వైఎస్సార్‌సీపీ నాయకురాలు , మాజీ కౌన్సిలర్ నాగసుబ్బమ్మ(70) ఆనారోగ్యంతో శనివారం మృతి చెందారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆమె సేవలను కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. నివాళులర్పించిన వారిలో చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, బోయకొండ ఆలయ చైర్మన్ నాగరాజారెడ్డి, పికెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆమెకు నివాళులర్పించారు.ఆమె అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు.
Tags: YSRCP leader Nagasubbamma passed away in Punganur