వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిని గెలిపించాలని ప్రచారం
పుంగనూరు ముచ్చట్లు:
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ పట్టణంలోని అన్నిప్రాంతాల్లోను ప్రచారాలు ముమ్మరం చేశారు. శనివారం ఎన్‌ఎస్.పేటలో మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా , మున్సిపల్ వైస్ చైర్మన్ సిఆర్.లలిత, కౌన్సిలర్ రాఘవేంద్ర ఆధ్వర్యంలో ప్రచారాలు చేశారు. అలాగే గోకుల్‌వీధిలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, కన్వీనర్ వరదారెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. అలాగే సుబేదారువీధిలో కౌన్సిలర్లు కిజర్‌ఖాన్, నయీంతాజ్, వైఎస్సార్‌సీపీ మైనార్టీ కార్యదర్శి ఇంతియాజ్ లు ప్రచారం చేశారు. షిరిడిసాయినగర్‌లో కౌన్సిలర్ కొండవీటి నటరాజ, హైస్కూల్‌వీధిలో కౌన్సిలర్ త్యాగరాజు, తిరుపతి రోడ్డులో కౌన్సిలర్ జయభారతి, వైఎస్సార్‌సీపీ నాయకుడు జయకృష్ణ కరపత్రాలు పంపిణీ చేశారు. చింతలవీధిలో కౌన్సిలర్లు రెడ్డెమ్మ, కాళిదాసు, కుమ్మరవీధిలో కౌన్సిలర్ జెపి.యాదవ్ కరపత్రాలు పంపిణీ చేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ ప్రచారాలలో నాయకులు త్రిమూర్తిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, లక్ష్మణ్‌రాజు, రమణ, ఖాన్, సలామత్ తదితరులు పాల్గొన్నారు.

Tags: YSRCP MLC candidate Shyam Prasad Reddy is campaigned to win
