YSRCP motorcycle rally

వైఎస్సార్‌సీపీ మోటారుసైకిల్‌ ర్యాలీ

– పట్టణంలో స్తంభించిన ట్రాఫిక్‌

Date:23/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ గురువారం మోటారు సైకిల్‌ ర్యాలీ భారీ ఎత్తున నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు అక్కిసాని భాస్కర్‌రెడ్డి , నాగరాజారెడ్డి, మాజీ జెడ్పిటీసీ వెంకటరెడ్డి యాదవ్‌, మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్దీన్‌షరీఫ్‌, అంజుమన్‌ కమిటి కార్యదర్శి అమ్ము ఆధ్వర్యంలో మోటారు సైకిల్‌ ర్యాలీకి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మోటారు సైకిల్‌ ర్యాలీని ఆర్‌ఆర్‌ కల్యాణ మండపం వద్ద వెంకటరెడ్డి యాదవ్‌ జెండా ఊపి ప్రారంభించారు. మోటారుసైకిల్‌ర్యాలీ ఎంబిటి రోడ్డు, అంబేద్కర్‌ సర్కిల్‌, గోకుల్‌సర్కిల్‌ , బస్టాండు , ఇందిరాసర్కిల్‌, తూర్పువెహోగశాల, సుబేదారువీధి, సెంటర్‌లాడ్జీ , బ్రాహ్మణవీధి మీదుగా కోనేటిపాళ్యెం, బైపాస్‌ రోడ్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు పుంగనూరు పార్టీ నాయకులు, ప్రజలు మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు. రాయలసీమ నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రులు ఎవరు చేయని విధంగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, అధికార వికేంద్రీకరణ చేపట్టడం హర్షనీయమన్నారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ ర్యాలీలో వైఎస్సార్‌ మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ అమరేంద్ర, మాజీ ఎంపీపీ నరసింహులు, పార్టీ నాయకులు చెంగారెడ్డి, త్యాగరాజు, ఎంఎస్‌.సలీం, మనోహర్‌, ఖాదర్‌బాషా, రెడ్డెప్ప, రాజశేఖర్‌రెడ్డి, హరినాథరెడ్డి, కిజర్‌ఖాన్‌, రాజేష్‌, హేమంత్‌, కుమార్‌, మంగళం బాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రజస్వామ్యాన్ని అపహ్యం చేసిన బాబుదిష్టిబొమ్మ దగ్ధం

Tags: YSRCP motorcycle rally

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *