Natyam ad

అభివృద్ధి , సంక్షేమమే వైఎస్సార్‌సీపీ అజెండా-ఎంపీ మిధున్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలన అభివృద్ధి , సంక్షేమమే అజెండాగా కొనసాగుతోందని రాష్ట్ర ప్రజలు ఎంతో సంతృప్తికరంగా ఉన్నారని లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన మున్సిపాలిటిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జగనన్న ఇచ్చిన మ్యానిఫెస్టోను 98 శాతం అమలు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలోను విజయం సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో అన్ని రకాల సమస్యలను పరిష్కరించి, అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికి నవరత్నాలను అందించడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే క్యాలెండర్‌ విడుదల చేసి ముఖ్యమంత్రి ప్రజలకు నేరుగా ఖాతాల్లోకి డబ్బులు జమచేసే కార్యక్రమం విజయవంతంగా అమలు చే స్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రజల ముంగిటకు పరిపాలనను తీసుకెళ్లిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిదేనని కొనియాడారు. దేశంలోని పలు రాష్ట్రాలు ఆంధ్రర్ఖా•న్ని ఆదర్శంగా తీసుకుని, పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజల కష్టాన్ని గుర్తించి, సమస్యలు పరిష్క్రరిస్తున్న వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలందరు చిరకాలం ముఖ్యమంత్రిగా ఉండేలా ఆశీర్వదిస్తున్నారని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు జింకా వెంకటాచలపతి, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము, పీకె ఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: YSRCP’s agenda is development and welfare – MP Midhun Reddy

Post Midle