Natyam ad

వైఎస్ఆర్సీపీ “మేమంతా సిద్ధం బస్సు యాత్ర” సూపర్ హిట్..

ప్రొద్దుటూరు ముచ్చట్లు:

రెండో రోజు జగన్ ప్రొద్దుటూరు నుంచి నంద్యాల వరకు చేసిన బస్సు యాత్రకి మరియు నంద్యాలలో నిర్వహించిన సభకి మద్దత్తుగా పెద్దసంఖ్యలో ప్రజలు హాజరైయ్యారు. ప్రజలతో మాట్లాడుతూ సీఏం జగన్ తన 5 సంవత్సరాల పాలనలో పేద ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ పథకాల ద్వారా అందించిన 2.7 లక్షల కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరికి ఎంతో మంచి చేసిందని ఆనందాన్ని వ్యక్తపరిచారు.ఈ పథకాలు ఇలానే కొనసాగాలన్నా, మరిన్ని మెరుగైన పథకాలు రావాలన్న కేవలం వైఎస్ఆర్సీపీ వల్లనే సాధ్యమవుతుందని,దానికోసం వస్తున్న ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు మరియు 25 లోక్‌సభ సీట్లు వైఎస్ఆర్సీపీకి అందించాలని సూచించారు.. అలా చేస్తే ప్రజల పార్టీ గెలుస్తుందని,14 ఏళ్లు సీఎం గా ఉండి ప్రజలని దోచుకున్న చంద్రబాబుకి బుద్ధి చెప్పినట్టు కూడా అవుతుందని చెప్పారు.. దానితో పాటు ప్రజలని,రాష్ట్రాన్ని దోచుకోడానికి కుమ్మక్కై పొత్తుగా వస్తున్న టీడీపీ,జనసేన,బీజేపీ లని ఒక్కసీటు కూడా గెలవనివ్వకుండా చేస్తే ఇంకోసారి ప్రజలని మోసం చెయ్యడానికి ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా,ప్రజలు మంచి వైపే నిలబడతారు,ప్రజలకి మంచి చేసే పార్టీనే నిలబెడతారని ప్రపంచానికి చెప్పినట్టు అవుతుందని తెలిపారు సీఎం జగన్.

Post Midle

Tags: YSRCP’s “Memanta Saaraat Bus Yatra” is a super hit.

Post Midle