పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీ లక్ష్మి

అమరావతి ముచ్చట్లు:

 

ఏపీలోని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీ లక్ష్మికి సూపర్ టైమ్ స్కేల్ పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సూపర్ టైమ్ స్కేల్లోని 17 స్థాయి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది జనవరి 18 తేదీన ఆమెకు సూపర్ టైమ్ స్కేల్లోని 15 స్థాయి పదోన్నతిని ప్రభుత్వం కల్పించింది. అయితే ఆరు నెలలు తిరగకుండానే ఆమెకు రెండు అత్యున్నత స్థాయి పదోన్నతులు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సూపర్ టైమ్ స్కేల్ 17 స్థాయి ప్రకారం, నెలసరి వేతనాన్ని 2 లక్షల 25 వేలుగా ప్రభుత్వం నిర్దారించింది.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Y.Sri Lakshmi, Special Principal Secretary, Department of Municipalities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *