18న ఎమ్మెల్యే పెద్దిరెడ్డిచే వైఎస్సాఆర్సీపి నాయకుల సమావేశం

ysrrpp-leaders-meet-on-18th-mla-peddyareddy

ysrrpp-leaders-meet-on-18th-mla-peddyareddy

Date:16/07/2018

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సాఆర్సీపి నేతలు, బూత్‌కమిటి సభ్యులు, వివిధ ప్రజాప్రతినిధుల సమావేశం ఈనెల 18న జరుగుతుందని వైఎస్సాఆర్సీపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశం ఎంపిపి నరసింహులు , పట్టణ మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌ కలసి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరౌతారని తెలిపారు. పుంగనూరు, చౌడేపల్లె మండలాలు కలసి చౌడేపల్లె మండలంలోని బిల్లెరు క్రాస్‌ వద్ద ఉదయం 9 గంటలకు సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి జెడ్పిటిసిలు, ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు , పెద్దిరెడ్డి అభిమానులు తప్పక హాజరుకావాలెనని ఆయన కోరారు.

18న ఎమ్మెల్యే పెద్దిరెడ్డిచే వైఎస్సాఆర్సీపి నాయకుల సమావేశంhttps://www.telugumuchatlu.com/ysrrpp-leaders-meet-on-18th-mla-peddyareddy/

Tags: YSRCP leaders meet on 18th MLA Peddyareddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *