అతివల భవితకు భరోసా వైయస్ఆర్ చేయూత

-జిల్లాలో ఒక లక్షా 69 వేల 767 మందికి 318 కోట్ల రూపాయలు

 

బాపూజీ కళామందిర్ ముచ్చట్లు:

వైయస్ఆర్ చేయూతతో అక్కచెల్లెమ్మల భవితకు భరోసా కలుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మూడో యేడాది వైయస్ఆర్ చేయూత పథకాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి డిబిటి విధానంలో ఆయన శుక్రవారం కుప్పం నుండి నగదు బదిలీ చేశారు. జిల్లాలో బాపూజీ కళామందిర్ లో ఏర్పాటు చేసిన వైయస్ఆర్ చేయూత కార్యక్రమంలో రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ మహిళా సాధికారతను సాధించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు. రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. మహిళాభివృద్థికి ప్రభుత్వం వివిధ పథకాలను వేల కోట్ల రూపాయలుతో అమలు చేస్తున్నట్లు వివరించారు. వైయస్ఆర్ చేయూత పథకం దసరా ఖర్చులకు వినియోగించవద్దని, అభివృద్ధి చెందే విధంగా వ్యాపార ఖర్చులకు వినియోగపడాలన్నారు. ఏదైనా వ్యాపారం చేసుకంటానంటే ఒకే సారి 75 వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. యస్.ఆర్ చేయూత అనేది 45 నుండి 60 సంవత్సరాల వయస్సు గల బి.సి, యస్.సి, యస్.టి మరియు మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు నాలుగు విడతలలో రూ.75000/- లను ప్రభుత్వం ఆర్థిక సహాయంగా ఇస్తుందని వివరించారు. వై.యస్.ఆర్ చేయూత పథకం క్రింద ప్రభుత్వం రిటైల్, వస్త్ర వ్యాపారంలో గుర్తించబడిన లబ్ధిదారులకు మద్దతు ఇవ్వడానికి అమూల్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ఐటిసి లిమిటెడ్, ప్రాక్టర్ & గాంబుల్, రిలయన్స్ రిటైల్, అజియో బిజినెస్ వంటి బహుళ జాతి కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు.

 

 

పాడి రైతులకు పశువుల పెంపకం, పాల సేకరణ, కిరాణా షాపులు, బట్టల షాపులు ఏర్పాటు, పండ్లు, కూరగాయలు, చిన్న జీవాలు కొనుగోలుకు ఆర్ధిక సహాయం చేయడం ద్వారా చిన్న, మద్య తరహా వ్యాపారాలు నడుపుకోవడానికి లేదా జీవనోపాధి కార్యక్రమాలకు ఉపయోగపడు తుందన్నారు. వచ్చే అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఒక లక్షా 69 వేల 767 మందికి 318 కోట్ల రూపాయలతో లబ్ధి చేకూరనుందన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ మూడవ విడత వైయస్ఆర్ చేయూత 4 సంవత్సరాల్లో 75 వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుఓదన్నారు. మహిళలకు స్వేచ్ఛ, స్వయంగా ఆర్థిక సాధికారత సాధించే విధంగా ప్రభుత్వం మహిళలను ప్రోత్సహిస్తోంది వివరించారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మహిళలు అభివృద్ధి చెందుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు అన్ని మహిళలకు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు. గృహంలో మహిళా బాగుంటేనే కుటుంబం అంతా బాగుంటుందని ముఖ్య ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా ఉద్యోగులు ఉన్నారని, దిశ చట్టం ద్వారా మహిళలకు రక్షణ కల్పించినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలతో చిల్లర పనులకు వినియోగించకుండా భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉండే పనులు చేపట్టాలని హితవు పలికారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ వైయస్ఆర్ చేయూత అందుతుందని, అర్హత కలిగిన ఉండి ప్రస్తుతం జాబితాలో పేరు లేకున్నా ధరఖాస్తు చేసుకుంటే వైయస్ఆర్ చేయూత పథకం వస్తుందని చెప్పారు.

 

 

జిల్లాలో ఒక లక్షా 69 వేల 767 మందికి
318 కోట్ల రూపాయలు జమ కానుందని చెప్పారు. జిల్లాలో ఆమదాలవలస మండలంలో 3491 మంది లబ్ధిదారులకు 6565456250 రూపాయలు, ఆమదాలవలస పట్టణంలో 2490 మందికి 46687500 రూపాయలు, బూర్జ మండలంలో 3441 మందికి 64518750 రూపాయలు, ఎచ్చెర్ల మండలంలో 6049 మందికి 130181250 రూపాయలు, గార మండలంలో 6462 మందికి 121162500 రూపాయలు, హిరమండలం మండలంలో 3084 మందికి 57825000 రూపాయలు, ఇచ్ఛాపురం మండలంలో 4049 మందికి 75918750 రూపాయలు,
ఇచ్ఛాపురం పట్టణంలో 2281 మందికి 42768750 రూపాయలు, జలుమూరు మండలంలో 5063 మందికి 94931250 రూపాయలు, కంచిలి మండలంలో 5438 మందికి 101962500 రూపాయలు,

 

 

కవిటి మండలంలో 6463 మందికి 121181250 రూపాయలు, కోటబొమ్మాళి మండలంలో 6389 మందికి 119793750 రూపాయలు, కొత్తూరు మండలంలో 5965 మందికి 111843750 రూపాయలు, ఎల్.ఎన్. పేట మండలంలో 2771 మందికి 51956250 రూపాయలు, లావేరు మండలంలో 4947 మందికి 92756250 రూపాయలు, మందస మండలంలో 6390 మందికి 119812500 రూపాయలు, మెళియాపుట్టి మండలంలో 4367 మందికి 81881250 రూపాయలు,
నందిగాం మండలంలో 4938 మందికి 92587500 రూపాయలు, నరసన్నపేట మండలంలో 5994 మందికి 112387500 రూపాయలు, పలాస మండలంలో 3684 మందికి 69075000 రూపాయలు, పలాస కాశీబుగ్గ పట్టణాల్లో 3797 మందికి 71193750 రూపాయలు, పాతపట్నం మండలంలో 5049 మందికి 94668750 రూపాయలు, పోలాకి మండలంలో 5558 మందికి 104212500 రూపాయలు, పొందూరు మండలంలో 5405 మందికి 101343750 రూపాయలు,

 

 

రణస్థలం మండలంలో 6357 మందికి 119193750 రూపాయలు, సంతబొమ్మాళి మండలంలో 6268 మందికి 117525000 రూపాయలు, సారవకోట మండలంలో 4198 మందికి 78712500 రూపాయలు, సరుబుజ్జిలి మండలంలో 2654 మందికి 49762500 రూపాయలు, సోంపేట మండలంలో 6301 మందికి 118143750 రూపాయలు, శ్రీకాకుళం పట్టణంలో 12951 మందికి 242831250 రూపాయలు, టెక్కలి మండలంలో 5735 మందికి 107531250 రూపాయలు, వజ్రపుకొత్తూరు మండలంలో 6988 మందికి 131025000 రూపాయలను డిబిటి విధానంలో నగదు బదిలీ చేశారన్నారు.

 

నరసన్నపేట శాసన సభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ మహిళలు కోసం వైయస్ఆర్ చేయూత పథకం అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ పథకంతో ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే చర్యలు తీసుకోవాలని మహిళలను కోరారు. ముఖ్యమంత్రి ఆలోచన ఏ ఒక్క అర్హత గల మహిళకు పథకం అందలేదని అనకూడదని వివరించారు. ఆర్థికంగా, సామాజికంగా మహిళలకు గౌరవం పెరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆలోచనని తెలిపారు. సమాజంలో మహిళలు ప్రముఖపాత్ర వహించాలన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన సఫలం కావాలని చెప్పారు. అవినీతి లేకుండా పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. సమాజాభివృద్ధికి మహిళలు తోడ్పడతారని తెలిపారు. అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకొన్నట్లు పేర్కొన్నారు. విద్యతోనే కుటుంబాలు బాగుపడ తాయన్నారు. రాష్ట్రానికి సమర్థవంతమైన ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలిపారు.

 

 

 

పాతపట్నం శాసన సభ్యులు రెడ్డి శాంతి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు గూర్చి వివరించారు. అవినీతి లేకుండా పారదర్శకంగా మహిళల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రే నేరుగా నగదు జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. కాపు కార్పొరేషన్ అధ్యక్షులు మామిడి శ్రీకాంత్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వివిధ పథకాలు ప్రవేశపెట్టినట్లు కొనియాడారు. డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అమలు జరుతుందని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యులు హేమమాలిని మాట్లాడుతూ పాదయాత్రలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లు పేర్కొన్నారు. మహిళలు కష్టాలు చూసి మహిళలకు వివిధ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు రక్షణ కోసం దిశ చట్టం తీసుకువచ్చినట్లు చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సువ్వారి సువర్ణ మాట్లాడుతూ పేద ప్రజలు అభివృద్ధి చెందడానికి ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టిందని చెప్పారు మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వివిధ పథకాలు ప్రవేశపెట్టినట్లు వివరించారు. కళింగ కార్పొరేషన్ అధ్యక్షులు అందవరపు సూరిబాబు మాట్లాడారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, తమ కుటుంబం అభివృద్ధి చెందడానికి వివిధ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టినట్లు వివరించారు. ఆరోగ్య శ్రీ ద్వారా పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

 

 

ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు నమూనా చెక్కును అందజేశారు
ఈ కార్యక్రమంలో డిసిసిబి అధ్యక్షలు కరిమి రాజేశ్వరరావు, కాపు కార్పొరేషన్ అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, కళింగ కోమటి కార్పొరేషన్ అధ్యక్షులు అందవరపు సూరిబాబు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షులు బి. హేమమాలిని రెడ్డి, సుడా చైర్మన్ సుగుణ, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ సువ్వారి సువర్ణ, పొందర, కూరాకుల కార్పొరేషన్ చైర్మెన్ హైమవతి, డిసిఎంఎస్ అధ్యక్షులు సల్ల సుగుణ, రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ లోకేశ్వరరెడ్డి,
ఛైర్మన్ నర్తు రామారావు, డిఆర్డిఎ పిడి విద్యాసాగర్, మెప్మా పిడి కిరణ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామారావు, తదితరులు పాల్గొన్నారు.

 

Tags:YSR’s contribution to ensuring Ativala’s future

Leave A Reply

Your email address will not be published.