Natyam ad

వై ఎస్ ఆర్ టీ యు సి జోనల్ ఇంచార్జి ఎన్. రాజారెడ్డి పిలుపు

తిరుపతి ముచ్చట్లు:

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాసనసభ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని గెలిపించుకొని తిరుపతి అభివృద్ధి చేసుకొందామని వై ఎస్ ఆర్ టీ యు సి జోనల్ ఇంచార్జి నారపరెడ్డి రాజారెడ్డి పిలుపునిచ్చారు.శనివారం ఉదయం తిరుపతి లోని భైరగిపాట్టేడ లో 14వ వార్డ్ లో వార్డ్ అధ్యక్షులు అనీల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారం లో ముఖ్య అతిథిగా రాజారెడ్డి పాల్గొని ప్రసంగిస్తు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ది పొందిన ప్రతి మహిళా జగన్ మోహన్ రెడ్డి ని హృదయంలో పెట్టుకొని కాపాడుకొంటారని అన్నారు.

 

 

Post Midle

ఈ పథకాల ద్వారా రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని ప్రకటించిన చంద్రబాబు అట్లాంటి పథకాలను మేము అధికారంలోనికి వస్తే రద్దు చేస్తానని ప్రకటించక పోగా మరింత ఎక్కువ ఇస్తానని ప్రకటిస్తున్నారని అప్పుడు దివాళా తీయదానని ప్రశ్నించారు.అత్యంత ప్రశాంతతకు మారు పెరైనా తిరుపతిలో కూటమి అరాచక శక్తులను దింపి వాళ్ళ ఇష్టమొచ్చినట్లు ఓటింగ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నదని దానిని తిరుపతి వాసులు సాహించరని అన్నారు. చిత్తూరు నుండి దిగుమతి అయిన వారు ఓడినా వెంటనే మూట ముళ్ళు సర్దుకొని వెళుపోతారని విమర్శించారు. అభినయ్ నగర కార్పొరేషన్ డిప్యుటీ మేయర్ గా ఉన్నప్పుడే ఎంతో అభివృద్ధి చేసారని MLA అయితే ఇంకెంతో అభివృద్ధి చేస్తారని అన్నారు. తిరుపతి అభివృద్ధి జరగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో YSRCP నాయకులు అనీల్ రెడ్డి, రాగాల చంద్రశేఖర్ రాయల్, వెంకటరమణ రెడ్డి, చందు తదితరులు పాల్గొన్నారు.

Tags: YSRTU C Zonal Incharge N. Raja Reddy’s call

Post Midle