వై ఎస్ ఆర్ టి యు సీ కడప, తిరుపతి, నెల్లూర్ జిల్లాల జోనల్ ఇంచార్జిగా ఎన్. రాజారెడ్డి నియామకం
తిరుపతి ముచ్చట్లు:
వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల జోనల్ ఇంచార్జిలను రాష్ట్ర పార్టీ నియమించడం జరిగింది. అందులో భాగంగా పార్టీ అనుబంధ కార్మిక సంఘం మైన వై ఎస్ ఆర్ టి యు సీ కీ తిరుపతి, కడప, నెల్లూరు జిల్లాల జోనల్ ఇంచార్జి గా తిరుపతికి చెందిన వై ఎస్ ఆర్ టి యూ సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ రాజారెడ్డి ని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ రాజారెడ్డి మాట్లడుతూ నన్ను వై ఎస్ ఆర్ టి యు సీ జోనల్ ఇంచార్జి గా నియమించిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి, తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకరరెడ్డికి, అనుబంధ విభాగాల ఇంచార్జీ విజయసాయి రెడ్డి కి, సహ ఇంచార్జీ చెవిరెడ్డి భాస్కరరెడ్డి కి, YSRTUC రాష్ట్ర అధ్యక్షులు *డా. పూనూరు గౌతమ్ రెడ్డికి, *యువనేత భూమన అభినయ్ రెడ్డి లకు ధన్యవాదాలు తెలిపారు. ఏ రాజకీయ పార్టీకి ఐన కార్మిక సంఘాలు పట్టుకొమ్మలని, కార్మిక సంఘం బలంగా ఉంటే పార్టీ బలంగా ఉంటుందని తెలిపారు. 2024 ఎన్నికల ముందు ప్రజా సంఘాల బలోపేతానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వై ఎస్ ఆర్ టి యు సీ రాష్ట్ర అధ్యక్షులు డా పునూరు గౌతమ్ రెడ్డి సారథ్యంలో కార్మిక సంఘాలను నిర్మాణాత్మక రీతిలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు.
Tags: YSRTUC Kadapa, Tirupati, Nellore District Zonal Incharge N. Raja Reddy’s appointment

