YSSAR Jana Chaitanya Yatra coming soon

త్వరలో వైఎస్సార్ జన చైతన్య యాత్ర

Date:20/10/2020

కర్నూలు ముచ్చట్లు

అసలైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమదే నని దీనిపై ప్రజలకు వివరించేందుకు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జన చైతన్య యాత్ర చేపట్టనున్నట్లు అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ స్పష్టం చేశారు. ఇందుకోసం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోకవర్గాల్లోనూ పార్టీ సమన్వయకర్త లను నియమిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జగన్ పార్టీ పై తమ పార్టీ వేసిన కేసులో అంతిమ విజయం తమదే నని ఆయన ధీమా వ్యక్తంచేశారు. మంగళవారం కర్నూలు లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా లోని వివిధ అసెంబ్లీ నియోజక వర్గాల ఇంచార్జీ లు, పలు అనుబంధ సంఘాల సమన్వయ కర్త లను ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో నిజమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమదేనని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద వైఎస్సార్ పేరుతో రిజిస్టర్ అయిన ఏకైక పార్టీ అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే నని ఆయన స్పష్టం చేశారు.

 

దీనిపై తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఆధ్వర్యంలో ఢిల్లీ హైకోర్టు లో కేసు విచారణ లో ఉందని, ఏదేమైనా అంతిమ విజయం అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. అధికార బలం డబ్బు బలం తో జగన్ పార్టీ నాయకులు కార్యకర్తలు దౌర్జన్యం గా తమ పార్టీ పేరైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును వాడుకుం టు న్నార న్నారు. ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన పేరుతో కాకుండా మరో పేరుతో చెలామణి అవుతు న్నారని, దీని పై ప్రజలను ఛైతన్యం చేస్తూ డిసెంబర్ నెలలో తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ బాషా తో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జన చైతన్య యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. అన్ని పార్లమెంటు నియోకవర్గస్థాయిలో సమావేశాలు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా నియోకవర్గఇంఛార్జి లను నియమిస్తామని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని చెప్పారు.
తమది రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కోసం ఏర్పడిన నిజమైన వైఎస్సార్ అభిమానుల పార్టీ అని, రాజన్న రాజ్యం కాంక్షించే వైఎస్సార్ అభిమానులందరూ అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరా లని అబ్దుల్ సత్తార్ పిలుపు నిచ్చారు. అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్న వైఎస్సార్ ట్రేడ్ యూనియన్, అన్న వైఎస్సార్ స్టూడెంట్స్ ఫెడరేషన్, అన్న వైఎస్సార్ మహిళా సంఘం, అన్న వైఎస్సార్ ఎంప్లాయిస్ యూనియన్, అన్న వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్, అన్న వైఎస్సార్ జర్నలిస్టు యూనియన్,అన్న వైఎస్సార్ యువజన విభాగం,అన్న వైఎస్సార్ ఎస్సీ, ఎస్టీ ,బీసీ ,మైనార్టీ విభాగంలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

 

అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
కర్నూలు అసెంబ్లీ కన్వీనర్ గా సయ్యద్ షఫీ ఉల్లా, పత్తికొండ నియోజకవర్గ కన్వీనర్ గా తుగ్గలి శ్రీనివాస్ గౌడ్, గౌరవ అధ్యక్షు లుగా దార కొండయ్య, నంద్యాల పార్లమెంటు జిల్లా యువజన విభాగం కన్వీనర్ గా కే. పరమేశ్వర రెడ్డి, నందికొట్కూరు అసెంబ్లీ నియోజక వర్గ కన్వీనర్ గా జీ. శాలి మీయ్య, ఆలూరు అసెంబ్లీ నియోజక వర్గ కన్వీనర్ గా ఎం. రవి చంద్ర కుమార్ నంద, కర్నూలు జిల్లా మహిళా విభాగం కన్వీనర్ గా అందే మీనా కుమారి, కర్నూలు నగర ఎస్సీ సెల్ కన్వీనర్ గా భంగి సురేష్, కర్నూలు నగర మైనారిటీ సెల్ కన్వీనర్ గా ఎస్. ఇక్బాల్, శ్రీశైలం అసెంబ్లీ నియోజక వర్గం బీసి సెల్ కన్వీనర్ గా బి. శివ మల్లయ్య, వైఎస్సార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కన్వీనర్ గా ఎండీ నయీం అ హ మ్మద్, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కన్వీనర్ గా వి. నాగేంద్ర, కో కన్వీనర్ గా ఫరూక్ తదితరులను నియమించి, నియామక పత్రాలు అందజేశారు.

 

భర్త ఇంటి ముందు బైటాయింపు

Tags:YSSAR Jana Chaitanya Yatra coming soon

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *