విశాఖలో వైఎస్సార్ జయంతి

విశాఖపట్నంముచ్చట్లు:

 

 

మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి సందర్భంగా వైసీపీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. విశాఖలో వైయస్సార్ విగ్రహానికి మంత్రి అవంతి శ్రీనివాస్, పార్టీ నేతలు పూల మాలలు నివాళులు అర్పించారు. ఈ సందర్భం గా రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ … ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా ఉండిపోయే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. పేదవాడి గుండె చప్పుడు బాగా తెలిసిన వ్యక్తి. తెలుగువారికి బ్రాండ్ అంబాసిడర్ ఆయన. తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్రలో రాజశేఖరరెడ్డి నిలిచిపోతారు. దేశంలో సంక్షేమ విప్లవం తీసుకువచ్చిన వ్యక్తి వైఎస్ఆర్. తండ్రి బాటలోనే సీఎం వైఎస్ జగన్ పయనిస్తున్నా రు. సంక్షేమం కోసం రాజశేఖరరెడ్డి రెండు అడుగులు ముందుకు వేస్తే సీఎం జగన్ వంద అడుగులు ముందుకు వేస్తున్నారు. అని తెలిపారు.ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు వంశీకృష్ణ, మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్యే వాసుపల్లి, పార్టీ కన్వీనర్ కేకే రాజు, మళ్ళ విజయ ప్రసాద్, అక్రమాని విజయనిర్మల, మాజీ ఎమ్మెల్యేలు పంచకర్ల, చింతలపూడి, తైనాల విజయ్ కుమార్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:YSSAR Jayanti in Visakhapatnam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *