యూటర్న్

Yutarn

Date:25/07/2018

అమరావతి ముచ్చట్లు :(సూర్య)

దేశంలో ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడి నోట విన్న యూటర్న్ అనే పదమే వినపడుతోంది. చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ట్రాఫిక్‌ నిబంధనల గురించి , మాత్రమే యూటర్న్ అనే పదం వాడతారు. ప్రస్తుతం వేడెక్కిన రాజకీయాలలో యూటర్న్ అనే పదం అత్యధికంగా వాడబడుతోంది. దీనికి మూలం ప్రత్యేక హోదా అంశమే. తొలుత వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి నోట నుంచి వెలువడిన యూటర్న్ అనే పదం ప్రధాని నరేంద్రమోదీ వరకు వెల్లింది. పార్లమెంటులోని యూటర్న్ అనే పదమే ప్రతిధ్వనించి, చర్చనీయాంశంగా మారింది. ఈ యూటర్న్ అనే పదం తెరపైకి రావాడానికి ప్రధాన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు. బిజెపితో చేతులు కలిపి , అధికారంలోనికి వచ్చిన చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై రెండేళ్ల పాటు కనీస ఒత్తిడి చేయలేకపోయారు. మూడవ ఏట కేంద్రం ప్రకటించిన ఫ్యాకేజికి ఊకొట్టిన చంద్రబాబు అసెంబ్లిలో కేంద్రానికి దన్యవాదాలు తెలిపే తీర్మాణం చేశారు. సరిగ్గా ఇదే సమయంలో హ్గదా గురించి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేని చంద్రబాబు ఫ్యాకేజి కోసం యూటర్న్ తీసుకున్నారంటు మొట్టమొదటి సారిగా వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి బహిరంగంగా విమర్శించారు. అప్పటి నుంచి ఈ యూటర్న్ అనే పదం ప్రతి నోట నానుతోంది. ఇప్పుడు ఇదే పదం కేంద్రంపై ఆవిశ్వాస తీర్మాణ చర్చలు మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ కూడ చంద్రబాబు ఫ్యాకేజినే కావాలంటు హ్గదాను వదిలి యూటర్న్ తీసుకున్నారని చెప్పుకొచ్చారు. దీనితో ఈపదం ఇంకా పాఫులర్‌ అయింది.

 

యూటర్న్https://www.telugumuchatlu.com/yutarn/

Tags; Yutarn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *