Natyam ad

యువగళం పాదయాత్ర కళ్లకు కట్టిన పుస్తకం”యువతకు మనోబలం”..!

– టిడిపి అధినేత సతీమణి నారా భువనేశ్వరి చేతులమీదుగా పుస్తకావిష్కరణ

 

కుప్పం ముచ్చట్లు:

 

Post Midle

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మక యువగళం పాదయాత్రకు ఆంధ్రనాడు సంపాదకులు మద్దినేని హరిబాబు అక్షర రూపమిస్తూ జర్నలిస్టు లక్ష్మీపతి అందించిన యువగళం… “యువతకు మనోబలం” పుస్తకాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆవిష్కరించారు. బుధవారం కుప్పం పి ఈ ఎస్ వైద్య కళాశాలలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాలచెంత 27-1-2023న ప్రారంభమైన యువగళం పాదయాత్ర… 97 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 2300 గ్రామాల మీదుగా 226రోజులపాటు  కొనసాగి గాజువాక లోని అగనంపూడి వద్ద జనవరి 18-12-2023న ముగిసింది. 5కోట్లమంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ  తొలి రోజు నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 45 రోజులపాటు పాదయాత్రను అక్షరం, అక్షరం ప్రజలు అందిస్తూ… యువగళం జరిగిన తీరు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా లోకేష్ పట్టుదలతో ముందుకు సాగిన విధానాన్ని “యువగళం… యువతకు మనోబలం” పుస్తకంలో కళ్లకు కట్టారు. జగన్ పాలనలో బాధితులుగా మారిన వివిధవర్గాల ప్రజలకు నేనునాన్నని భరోసా ఇస్తూ లోకేష్ చేపట్టిన పాదయాత్రలో ప్రతి ఘట్టాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు.

 

 

 

ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ… ప్రజాచైతన్యమే లక్ష్యంగా జైత్రయాత్రలా సాగిన యువగళం రాష్ట్ర రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసిందన్నారు. పుస్తకం వ్రాయడం చాలా కష్టంతో కూడుకున్న పని అందులోనూ ఎంతోమందిని తన అక్షరాలతో మెప్పించగలగాలని, పాఠకులను ఆకర్షించగలగి నప్పుడే ఆ పుస్తకం విలువ పెరుగుతుందని అందులోనూ ప్రధానంగా యువగళం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన సమగ్ర విషయాలను ప్రతి అక్షరాన్ని అక్షరీకరించి తెలుగుదేశం అభిమానులకు, ప్రజలకు యువతకు, ఒక మనోబలం కాగలదని ఈ సందర్భంగా తెలియజేశారు. లోకేష్ పాదయాత్ర ఎంతో కష్టమైనప్పటికీ ఇటువంటి పుస్తకాలు చూసినప్పుడు చదివినప్పుడు ఆ కష్టాలు ఆవిరైపోతాయి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆంద్రనాడు యాజమాన్యo మద్దినేని హరిబాబు , కుప్పం రిపోర్టర్ లక్ష్మీపతి  ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో టిడిపి కుప్పం నియోజకవర్గం సమన్వయ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ప్రముఖ ఇండస్ట్రీ అనలిస్ట్ లంకిపల్లి అమరేంద్ర, యడ్లపూడి వెంకటేష్, రాష్ట్ర కార్యనిర్వాకర్ కార్యదర్శి డాక్టర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పి.మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:Yuvagalam Padayatra’s eye-catching book “Yuvataku Manobalam”..!

Post Midle